పేదల ఆకలి తీర్చిన కమ్యూనిస్టులు

పేదల ఆకలి తీర్చిన కమ్యూనిస్టులు

విజయవాడ: కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా విధించిన లాక్డౌన్ వల్ల నిరుపేదలు, కూలీలకు ఇబ్బంది.పనుల్లేక, సంపాదనలేక చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. అర్ధాకలితో గడుపుతున్నారు. కొందరైతే, పస్తులుంటున్నిరు. విజయవాడలోనే ఇలాంటి వారు వందల సంఖ్యలో ఉండడం గుర్తించిన సీపీఎం పార్టీ నేతలు, కార్యకర్తలు శుక్రవారం సింగనగర్ ప్రాంతంలో ఆహార పొట్లాల్ని 20 వేల మందికి వితరణ చేసారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలు, కూలీలపట్ల తమ బాధ్యతను విస్మరించారని పార్టీ ప్రముఖులు ఈ సందర్భంగా విమర్శించారు. రోజు కూలీపై ఆధారపడే వారు నానా పాట్లు పడుతున్నారు. వారికి వాలంటీర్ల ద్వారా భోజనం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు కేజీల బియ్యం, రూ. వెయ్యి ఒక్కో కుటుంబానికి ఎలా సరిపోతాయని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos