రాజ్యాంగ ప్రవేశిక చదివిన రావణ్‌

రాజ్యాంగ ప్రవేశిక చదివిన రావణ్‌

న్యూఢిల్లీ: నూతన పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళన కేసులో బెయిల్పై విడుదలైన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అలి యాస్ రావణ్ శుక్రవారం ఇక్కడి జామా మసీదు వద్దకు వెళ్లి ఆందోళనకారులతో కూర్చుని రాజ్యాంగ ప్రవేశిక చదివారు. న్యాయ స్థానం ఆదేశాలు, బెయిల్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆందోళనల్లో పాల్గొనటం లేదన్నారు. కేవలం రాజ్యాంగ ప్రవేశిక మాత్రమే చదివానని ఆజాద్ వివరించారు. అంతకుముందు ఆర్కే ఆశ్రమంలోని వాల్మీకీ ఆలయాన్ని సందర్శించిన ఆజాద్ గురుద్వారా, చర్చికీ వెళ్లనున్నట్లు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల కల్లా ఢిల్లీ విడిచి వెళ్లన్నుట్లు చెప్పారు. పౌరసత్వ నూతన చట్టాన్ని వ్యతిరేకిస్తూ జామా మసీదు వద్ద ఆందోళన చేపట్టినందుకు గానూ డి సెం బరు 21న ఆజాద్ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లంఘించినట్లు ఎలాంటి సాక్ష్యా ధారా లు లేనందున గురువారం రాత్రి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 24 గంటల్లోగా ఢిల్లీ విడిచి వెళ్లాలని, నాలుగు వా రా ల వరకు నగరానికి దూరంగా ఉండాలని ఆదేశించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos