అమ్మకానికి మల్య భవంతి

అమ్మకానికి మల్య భవంతి

పారిస్: భారత దేశ ఆర్థిక నేరగాడు విజయ్ మల్య ఫ్రాన్స్లో విలాస భవనం శిథిలావస్థకు చేరుకుంది. గత కొన్నేళ్లుగా ఎలాంటి మర మ్మతులకూ నోచుకోక పోవటంతో ఈ పరిస్థితి దాపురించింది.  ఇలీ సెయింటీ మార్గరైట్ ద్వీపంలో 1.3 హెక్టార్ల విస్తీర్ణంలోని – లీ గ్రాండ్ జార్డిన్ భవనాన్ని మల్య 2008లో కొన్నారు. ఇందు కోసం ఖతార్ నేషనల్ బ్యాంక్ ఎస్ఏక్యూకు చెందిన అన్స్బాచర్ అండ్ కో యూనిట్ నుంచి 30 మిలియన్ డాలర్ల రుణాన్ని గిజ్మో ఇన్వెస్ట్ కంపెనీ పేరిట తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల రుణ బకాయి చెల్లింపు గడువు పెంచాలని మల్య కోరటంతో బ్యాంక్ అధికార్లు ఆ సౌధాన్ని తనిఖీ చేసారు. భవనం చాలా వరకు దెబ్బతిన్నట్లు గుర్తించారు. విపణిలో దాని విలువ కూడా 10 మిలియన్ డాలర్ల వరకూ పడి పోయినట్లు అంచనా వేసార. దీంతో బకాయి వసూలుకు అన్స్ బాచర్ అండ్ కో న్యాయ స్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. రుణం తీసుకునేందుకు మాల్యా తా క ట్టు పెట్టిన ఇంగ్లాండ్లోని ఆయన విహార పడవను అమ్మి బకాయి తీర్చేలా ఆదేశాలివ్వాలని లండన్ న్యాయస్థానాన్ని కోరింది. దాన్ని అమ్మినా లభించే సొమ్ముతో రుణ బకాయి తీర నందున మల్య సౌధాన్ని కూడా అమ్మకానికి పెట్టామని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos