జార్జ్ రెడ్డి దర్శకుడికి పవన్ పిలుపు!

  • In Film
  • October 22, 2019
  • 144 Views
జార్జ్ రెడ్డి దర్శకుడికి పవన్ పిలుపు!

హైదరాబాద్ నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీ చరిత్రలో జార్జ్రెడ్డి అధ్యాయం ఎంతో కీలకం. 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్సీటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు.సమసమాజ స్థాపనే ధ్యేయంగా సాగిన జార్జ్ రెడ్డి ప్రస్థానం నేటికీ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఉస్మానియా యూనివర్శిటీలో చదువుతూ. విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడుగా ఎదిగిన జార్జి రెడ్డిని చాలా చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్థులు క్యాంపస్ లోనే హత్య చేశారు.విప్లవ భావజాలం నరనరాన జీర్ణించుకొని అప్పటి విద్యార్థుల్లో విప్లవ భావజాలాన్ని నిద్ర లేపిన జార్జ్ రెడ్డి వంటి టెర్రిఫిక్ లీడర్ గురించి ఈ తరానికి తెలియజేయడానికి అదే పేరుతో దళం చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించాడు.అందుకు సంబంధించి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ సైతం ఆకట్టుకోవడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి దర్శకుడు జీవన్ రెడ్డికి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. తనను వచ్చి కలవమని చెప్పారట.దీంతో దర్శకుడు జీవన్ రెడ్డి చాలా ఎగ్జైట్ అవుతున్నట్లు సమాచారం.పవన్ ఆలోచనలకు, అతడి భావాలకు దగ్గరగా సినిమా ఉండడంతో జీవన్ రెడ్డిని ప్రత్యేకంగా కలవడానికి సిద్ధమవుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos