ఒక్కరోజులో 40 వేల ఫోన్ కాల్స్..

ఒక్కరోజులో 40 వేల ఫోన్ కాల్స్..

దిశ హత్యాచారం అనంతరం దేశవ్యాప్తంగా పోలీసులు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించారు.ఇక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు సైతం వెంటనే అప్రమత్తమై ఆపద సమయంలో,అత్యసవర సమయాల్లో పోలీసులను సంప్రందించాల్సిన నంబర్లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి చర్యలు చేపట్టారు. పోలీసుల సహాయం కావాల్సి వస్తే సంకోచించకుండా 100, 112 నంబర్లకు సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇక పోలీసులు తక్షణం స్పందిస్తారా? సందేహం ఒకరు, ఇద్దరికి కాదు. ఏకంగా 40 వేల మందికి వచ్చింది. ఆదివారం ఒక్కరోజే 40 వేల మంది 112 నంబరుకు ఫోన్ చేసి పలు రకాల సహాయాలను కోరడం గమనార్హం. వారిలో అత్యధికులు పోలీసులు సకాలంలో స్పందింస్తున్నారని నిర్ధారించుకున్నారు. ఇక పోలీసు మొబైల్ యాప్ ను సైతం 30 వేల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.ఇదిలావుండగా, ఏపీలోని వాట్స్ యాప్ గ్రూపుల్లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న 9969777888 నంబరు పోలీసులది కాదని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరణ ఇచ్చారు. పోలీసు శాఖ పేరిట ప్రచారం అవుతున్న నంబర్‌ తాము ఇవ్వలేదని దీన్ని వైరల్ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఏపీలో పోలీసుల వద్ద 9121211100 వాట్స్ యాప్ నంబర్ ఉందని ఆయన స్పష్టం చేశారు. 100, 112లతో పాటు 181 నంబర్ ను కూడా మహిళలు ఆపద సమయాల్లో,అత్యసవర సమయాల్లో సంప్రదించాలని సూచించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos