సాఫ్ట్‌వేర్‌ నుంచి పూలబాటకు

  • In Local
  • January 21, 2019
  • 953 Views
సాఫ్ట్‌వేర్‌ నుంచి పూలబాటకు

ఉద్యోగాల్లో నానాటికీ పెరుగుతున్న ఒత్తిళ్లు, వ్యవసాయం మీద వున్న మక్కువ నవ యువతను పల్లెల వైపు నడిపిస్తున్నాయి. అలాంటి వారిలో ఒకరైన దయాకర్‌ సాప్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సేద్యం బాట పట్టారు. పాలీహౌస్‌లో జర్బారా పూల సాగు చేస్తూ లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్నారు. మిర్యాలగూడకు చెందిన దయాకర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, ఆయన భార్య అనీష న్యాయవాది. ఉద్యోగంలో ఒత్తిళ్లు, నగర జీవనం కంటే వ్యవసాయంలో ప్రశాంతత లభిస్తుందని భావించారు. దయాకర్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. యాదాద్రి – భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బొందుగుల గ్రామంలో ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. రెండు ఎకరాల్లో సపోటా తోట వేశారు. మిగిలిన నాలుగున్నర ఎకరాల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులను సేంద్రియ విధానాలతో మేళవించి సేద్యం చేయాలని సంకల్పించారు. మామయ్య సలహా మేరకు పాలీహౌ్‌సలో పూల సాగుపై దృష్టి సారించారు. ప్రభుత్వం పాలీహౌ్‌సలకు సబ్సిడీని అందజేస్తూ ప్రోత్సహిస్తున్నదని తెలుసుకున్నారు దయాకర్‌. ఆ పథకాన్ని వినియోగించుకున్నారు. 2016లో ప్రభుత్వం నుంచి పాలీహౌస్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. రూ.2 లక్షలు తన వాటాగా చెల్లించారు. సుమారు రూ.18 లక్షలతో అర ఎకరం విస్తీర్ణంలో పాలీహౌస్‌ నిర్మించారు. మరో రూ.20 లక్షలను వెచ్చించి పూల సాగు కోసం ప్రత్యేకంగా బెడ్‌లను తయారుచేశారు. సేంద్రియ ఎరువులతో పూల సాగు చేపట్టారు. 

 జర్బరా రకానికి చెందిన పూల మొక్కలను బెంగూళూర్‌ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఒక్కో మొక్కను రూ.35కు కొనుగోలు చేశారు ఈ యువరైతు. జర్బరా పూలను పెళ్లిళ్లు, వేడుకల సమయంలో డెకరేషన్‌కు ఉపయోగిస్తారు. బొకేలలో కూడా వీటిని వాడతారు. ఈ పూలకు నిరంతంరం డిమాండ్‌ వుంటుంది. ఈ సమాచారం తెలుసుకున్న దయాకర్‌ పాలీహౌ్‌సలో మొత్తం 10 రకాల పూలమొక్కల సాగు ప్రారంభించారు. రెడ్‌, పింక్‌, యెల్లో, లైట్‌ వైట్‌, వైట్‌, లైట్‌ యెల్లో, ఆరెంజ్‌, ప్యూర్‌ వైట్‌ రకాలను సాగు చేశారు. అర ఎకరం పాలీహౌ్‌సలో 12 వేల మొక్కలను నాటారు. మొక్కలు నాటిన 70 రోజులకు పూల దిగుబడి మొదలైంది. ఎప్పటికప్పుడు హార్టికల్చర్‌, శాస్త్రవేత్తల సూచనల మేరకు మందులు వాడుతూ నాణ్యమైన పూలను సాగు చేశారు. రోజుకు రెండు వేల వరకు పూలను కోస్తున్నారు. ఒక్కో పువ్వు రూ.4 వరకు ధర పలుకుతోంది. పూలను చేర్యాల, జనగాం, ఆలేరు, భువనగిరి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. లోకల్‌గా డిమాండ్‌ అధికంగా ఉంది. ఖర్చులు పోనూ నెలకు రూ.లక్ష వరకు లాభం వస్తున్నదని దయాకర్‌, అనీష వివరించారు. సాఫ్ట్‌వేర్‌ కంటే సాగు మే

 ప్రభుత్వం కల్పించే రాయితీలను ఉపయోగించుకుని, సేంద్రియ పద్ధతుల్లో ఖర్చులు తగ్గించుకుని సాగు చేస్తే తప్పక లాభాలు వస్తాయి. జర్బరా పూలకు మార్కెట్‌లో మంచి గిరాకీ వుంది. పాలీహౌస్‌ ఏర్పాటుచేసి, మార్కెట్‌లో గిరాకీ వున్న పూలను సాగు చేస్తున్నాను. ఈ పూల సాగు వల్ల నిత్యం ఆదాయం వస్తున్నది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను. నాతో పాటు పది మందికి ఉపాథి కల్పించగలుగుతున్నందుకు తృప్తిగా వుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos