వరుసగా మూడో రోజు పాక్‌ కాల్పులు

వరుసగా మూడో రోజు పాక్‌ కాల్పులు

పూంచ్‌: జమ్ము-కశ్మీర్‌ సరిహద్దులోని
పూంచ్‌ సెక్టార్‌లో వరుసగా మూడో రోజు గురువారం కూడా  పాక్‌ కాల్పులు జరిపింది. బుధవారం రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద ,మంగళవారం రాజౌరీలోని నౌషెరా సెక్టార్‌ నియంత్రణ రేఖ వద్ద
పాక్‌ పదాతి దళాలు  కాల్పులు జరిపింది. ‘2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘిస్తోంది ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని భారత్‌ కోరినా తమ తీరుని కొనసాగిస్తోంది’ అని భారత రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. బుధవారం సాయంత్రం 4.30కి పాక్‌ తీవ్ర స్థాయిలో కాల్పులకు తెగబడిందని చెప్పారు. పాక్‌ కాల్పులను భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు. గత జనవరిలో కూడా పాక్‌ పలుసార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల్లో 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా 2018లో పాక్‌ అత్యధికంగా 2,936 సార్లు కాల్పులకు పాల్పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos