యూట్యూబ్ లో చూసి ఎటిఎంలో చోరీకి యత్నం

  • In Crime
  • January 21, 2019
  • 910 Views
యూట్యూబ్ లో చూసి ఎటిఎంలో చోరీకి యత్నం

అన్నిటికీ యూట్యూబ్.. ఏదైనా నేర్చుకోవచ్చు. ఏమైనా చేయొచ్చు. మాస్టర్స్‌తో పనేముంది. మన చేతిలో సెల్లుంటే చాలు. అడిగిన వన్నీ అరక్షణంలో కళ్లముందు ఉంచేస్తుంది. అమ్మ కంటే వివరంగా అన్నీ చెప్పేస్తుంది. వంటలు, కుట్లు, అల్లికలు, వగైరాతో పాటు మనిషికి ఉపయోగపడే మంచి విషయాలు కూడా మరెన్నో ఉంటాయి.అయితే మంచి కంటే చెడు త్వరగా చేరుతుందని.. ఈజీ మనీ కోసం ఏమైనా ఈజీ టిప్స్ అందిస్తుందేమోనని యూట్యూబ్ ఓపెన్ చేశాడు పంజాబ్‌కు చెందిన సమర్ జిత్ సింగ్. ఏటీఎంని ఎలా చోరీ చేయాలో యూట్యూబ్‌లో చూసి పథకం రచించాడు. అది కాస్తా బెడిసి కొట్టింది.. పోలీసుల చేతికి చిక్కి ఉన్నది కూడా పోగొట్టుకుని కటకటాలపాలయ్యాడు.ఆదివారం తెల్లవారుజామున హైదరాబాద్ కూకట్‌పల్లిలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అక్కడి యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సమీపంలో అనుమానాస్పందంగా తిరుగుతున్న సమర్ జిత్ సింగ్‌ని ఆపి పోలీసులు ప్రశ్నించారు. కాస్త తొట్రుపడుతూ సమాధానాలు చెబుతుండే సరికి పోలీసులకు అనుమానం వచ్చింది.

అక్కడ పార్క్ చేసిన కారు వద్దకు వెళ్లి పరిశీలించగా ఏటీఎం పగులగొట్టే పరికరాలు అందులో కనిపించాయి. అతడిపై అనుమానాన్ని బలపరచుకున్న పోలీసులు సింగ్‌ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అతడిని విచారించిన పోలీసులకు విస్తుపోయే సమాధానాలు చెప్పాడు. తాను గతంలో బెంగళూరులో ఫ్రిజ్‌లు రిపేర్ చేసేవాడినని, ఆదాయం సరిపోక ఇబ్బందులు పడుతుండడతో ఇలా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వివరించాడు.ఏటీఎం దోచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని యూట్యూబ్‌లో చూసి దొంగతనం చేయాలనుకన్నట్లు పోలీసులకు వివరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కారుతో పాటు గ్యాస్ కట్టర్, ఆక్సిజన్ సిలిండర్, 10 ఏటీఎం కార్డులు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos