యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క

యజమాని ప్రాణాలు కాపాడిన కుక్క

కుక్కకి విశ్వాసం ఎక్కవ అనే నానుడి ఉంది. ఈ నానుడి ఇప్పుడు నిజమని మరోసారి రుజువైంది. తనకు రోజు తిండి పెట్టి.. భద్రంగా పెంచుకున్న యజమాని ప్రాణాలను ఆ పెంపుడు కుక్కే రక్షించింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. పూణెకి చెందిన రమేష్ సంచేతి(65) అనే వైద్యుడు బ్రౌనీ అనే కుక్కని పెంచుకుంటున్నాడు. దాని కోసం ప్రత్యేకంగా అమిత్ అనే  ఓ నౌకర్ని నియమించి మరీ దాని బాగోగులు చేసుకునేవాడు. ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12గంటల సమయంలో బ్రౌనీకి అమిత్ భోజనం పెట్టాడు.అయితే.. బ్రౌనీ భోజనం చేయడానికి నిరాకరించింది. యజమాని రమేష్ గది వద్దకు వెళ్లి పచార్లు చేయడం మొదలుపెట్టింది. దీని ప్రవర్తన తేడా ఉండటంతో.. రమేష్ గది తలుపులు తెరచి చూశాడు అమిత్. చూడగా.. రమేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందించాడు. దీంతో.. అతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఏ మాత్రం ఆలస్యం చేసినా.. రమేష్ ప్రాణాలు పోయేవని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై నౌకర్ అమిత్ మాట్లాడుతూ.. సమయానికి బ్రౌనీ నన్ను అప్రమత్తం చేయబట్టే.. ఇప్పుడు రమేష్ ప్రాణాలతో బతికి బయటపడ్డారు అని చెప్పారు. తన ప్రాణాలు కాపాడిన బ్రౌనీని చూసుకొని రమేష్ మురిసిపోతున్నాడు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos