భామలు.. ఈ డిప్రెషన్ గోలేంటో

  • In Film
  • January 25, 2019
  • 759 Views
భామలు.. ఈ డిప్రెషన్ గోలేంటో

ఒత్తిడి.. వినడానికి ఈ పదం ఎంత సింపుల్ గా ఉంటుందో అంత ఘోరంగా కాల్చేస్తుంది. తెలియకుండానే అదో ప్రమాదకర ఫోబియాలా మారుతుంది. దీనినే డిప్రెషన్ అని డాక్టర్లు చెబుతుంటారు. రంగుల ప్రపంచంలో అందాల కథానాయికలు ఈ సమస్యకు అతీతులా? అంటే .. ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొనేది వీళ్లేనని అనుభవ పూర్వకంగా చెప్పేవాళ్లు ఉంటారు. పైకి ఎలా కనిపించినా – తెరవెనక తమని ఈ మహమ్మారీ ఎలా ఖూనీ చేస్తుందో కథలు కథలుగా చెబుతుంటారు కొందరు.

ప్రపంచ విఖ్యాత మైఖేల్ జాక్సన్ మరణానికి కారణమైంది ఈ డిప్రెషన్. తీవ్రమైన మానసిక ఒత్తిడిని తట్టుకోలేక దాని భారి నుంచి తనని తాను రక్షించుకునేందుకు అధిక మోతాదులో మత్తు పదార్థాలు సేవించడం – నిద్ర బిళ్లలు మింగడమే అతడి శరీరం తన అదుపులో లేకుండా చేసిందని డాక్టర్లు చెప్పారు. బాక్సింగ్ క్రీడాకారుడు మైక్ టైసన్ సైతం ఇలాంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నాడు.

ప్రపంచవ్యాప్తంగా అశేషంగా అభిమనులు ఉన్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంతటివాడే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యానించారంటే ఆ సందర్భంలో అతడు ఓ సామాన్యుడిలా ఒత్తిడిని ఎదుర్కొన్నారని అందరికీ అర్థమైంది. రాజ్ పుత్ రాణి పద్మావతి గా అద్భుత ఆహార్యం ప్రదర్శించిన దీపిక పదుకొనేను చూడగానే తనకు సమస్యలేం ఉంటాయి? అనుకుంటే పొరపాటే. ఒకానొక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాని దీపిక నిర్ఘాంతపోయే నిజాల్ని చెప్పి అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. సుచీలీక్స్ సుచీ రంగుల ప్రపంచంలో రక్కస ఒత్తిడిని ఎదుర్కోవడం అది మానసిక రుగ్మతకు దారి తీయడం.. పర్యవసానంగా సమాజంపై ఊహాతీతమైన ప్రతీకారానికి పూనుకోవడం వగైరా ఈ సమస్య తీవ్రతను అద్దంపట్టింది. యాంకర్ రష్మి గౌతమ్ సైతం తనకు వింతైన ఒత్తిడి ఎదురయ్యిందని ఓ సందర్భంలో తెలిపారు. అందాల చందమామ కాజల్ సైతం ఒత్తిడితో పాటు ఆస్తమా మహమ్మారీ తనని చుట్టు ముట్టిందని ఇటీవలే తెలిపారు. ముంబై మారథాన్ లో పరుగు పూర్తయ్యే క్రమంలో తాను తీవ్రంగా ఆస్తమాతో ఇబ్బంది పడ్డానని తెలిపింది. ఇలా ఫేజ్ 3 ప్రపంచంలో ఎందరో ఈ మహమ్మారీకి గురయ్యారు. ప్రత్యక్ష అనుభవంతో వాళ్లు చెప్పేది చెవులు రిక్కించి వినాల్సిందే. ఈ ఒత్తిడి గోలేంటో! అని తేలిగ్గా తీసి పారేయడానికి లేదు!! బంగెన పల్లి మామిడి పండు ఠెంకకు పట్టిన పురుగు చందం ఈ ఒత్తిడి బతుకులు అన్నమాట!!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos