ఫోటో స్టోరి: బుట్టబొమ్మ కేరాఫ్ గీత

  • In Film
  • January 25, 2019
  • 159 Views
ఫోటో స్టోరి: బుట్టబొమ్మ కేరాఫ్ గీత

అందం నీపేరా ఆనందం నీ ఊరా
నండూరి నాయికివా శృంగార దేవతవా

. `చిరునవ్వు`తో సినిమాలోని ఈ పాట గీత(రష్మిక)కు పెర్ఫెక్ట్ యాప్ట్. ఇదిగో ఇలా `బంగారు బ్లౌజు- పచ్చ పరికిణీ` లో కొంటెగా కుర్రకారును తెగ కవ్విస్తోంది. అందానికి చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తోంది. నటించిన తొలి సినిమా (ఛలో) తోనే తెలుగు యువతలో ఫాలోయింగ్ సంపాదించుకుని అటుపై `గీతగోవిందం` నాయికగా మెరుపులు మెరిపించింది. గీతను ప్రేమించని యువకుడు లేడు అనేంతగా ఫాలోయింగ్ తెచ్చుకుంది. `దేవదాసు` సినిమాలో నాని సరసన నటించి మెప్పించింది. 

చాలా తక్కువ సమయంలో ఎక్కువ ఫేం సంపాదించిన నవతరం నాయికగా రష్మిక మందన పేరు మార్మోగిపోతోంది. ఇంకేం ఇంకేం కావాలే! అంటూ ఈ భామను అంతే ఇదిగో ఫాలో అవుతోంది యూత్.  లేటెస్ట్ ఫోటోషూట్ లో ట్రెడిషనల్ లుక్ లో ఈ బ్యూటీ కవ్విస్తోంది. ఈ ఫోటో ప్రస్తుతం జోరుగా వైరల్ అయిపోతోంది. రష్మిక కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే ఈ ఏడాది వరుసగా నాలుగు సినిమాల్లో నటించేస్తోంది. గీత గోవిందం హీరో దేవరకొండ సరసన `డియర్ కామ్రేడ్` చిత్రీకరణ ఇప్పటికే మెజారిటీ పార్ట్ పూర్తయింది. కన్నడ సినిమాలు.. పొగరు యజమాన తెలుగు సినిమా భీష్మ సెట్స్ పై ఉన్నాయి. యజమాన పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos