ప్రతీకారాన్ని తీర్చుకుంటాం

ప్రతీకారాన్ని తీర్చుకుంటాం

ముంబయి: పుల్వామా ఉగ్ర దాడి కి ప్రతీకారాన్ని తీర్చుకుంటామనని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తేల్చి చెప్పారు. దాడికి పాల్పడ్డవారిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని కుండబద్ధలు కొట్టారు. లోక్‌సభ ఎన్నికల మహారాష్ట్రలోని యవత్మాల్‌లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన  లోక్‌సభ ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.  ‘ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ ను వదలి పెట్టేది లేదు. తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తగిన బుద్ధి చెబుతాం. భారత భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం.  జవాన్ల మృతి కారణంగా అందరూ చాలా బాధలో ఉన్నారని నాకు తెలుసు. మీ ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను. జవాన్లలోనూ ఆగ్రహం ఉంది. ముఖ్యంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లలో. వారి ఆగ్రహాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.  మహారాష్ట్రకు చెందిన ఇద్దరు జవాన్లు ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వారి ప్రాణత్యాగం వృథా కాదు’ అని వ్యాఖ్యానించారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos