ప్రకంపనాలు సృష్టిస్తున్న లాక్

  • In Film
  • February 9, 2019
  • 132 Views
ప్రకంపనాలు సృష్టిస్తున్న  లాక్

ఒకే ఒక్క కన్ను గీటుతో ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకుంది వింక్ గాళ్ ప్రియా వారియర్. `ఒరు ఆడార్ లవ్` తొలి టీజర్ తోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూత్ స్పెల్ బౌండ్ అయిపోయారు. ప్రియా అందచందాలకు ఫిదా అయిపోయి కంటికి కునుకు పట్టని స్థితికి వెళ్లిపోయారు. సన్నీలియోన్ దీపిక పదుకొనేలకు ధీటుగా సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. `ఒరు ఆడార్ లవ్` టీజర్ ఆ స్థాయి సెన్సేషన్స్ సృష్టిస్తుందని – ప్రియా ప్రకాష్ వారియర్ అంతమంది మనసు దోచేస్తుందని కానీ ఆరోజు ఎవరూ ఊహించలేదు. ఆయాచితంగా వచ్చిన ఆ క్రేజుతో ఆ సినిమా మార్కెట్ రేంజ్ అమాంతం స్కైని టచ్ చేసింది. ప్రస్తుతం మలయాళ వెర్షన్ తో పాటుగా తెలుగు వెర్షన్ ని సైమల్టేనియస్ గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ప్రేమికుల రోజు కానుకగా `లవర్స్ డే` పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.రిలీజ్ ముందు ప్రచారంలోనూ వేడి పెంచింది టీమ్. సరిగ్గా వారం ముందు ప్రియా ప్రకాష్ – రోషన్ లిప్ లాక్ టీజర్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ టీజర్ జెట్ స్పీడ్ తో అంతర్జాలంలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే కోటి పైగా వ్యూస్ ని దక్కించుకుంది. అయితే అంతే ధీటుగా డిస్ లైక్స్ వచ్చాయి. వివాదాలకు ఆజ్యం పోస్తోంది టీజర్. ఈ లిప్ లాక్ టీజర్ ని ఏకంగా 50 వేల మంది డిస్ లైక్ చేయడంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇది స్కూల్ పిల్లల్ని వెర్రెత్తించే ప్రయత్నం అంటూ నెటిజనులు తిట్టి పోశారు. “వ్వాట్ ద హెల్? ఇది రిమాన్సా?  లేక చీప్ పబ్లిసిటీ ట్రిక్కా.. ఏంటీ క్లిప్?“ అంటూ తిట్టేశాడు ఓ నెటిజన్. ఇది సెక్సువల్ కంటెంట్.. బ్యాన్ చేయాలి.. అంటూ కొందరు.. స్కూల్ పిల్లల్ని నాశనం చేసే పని ఇది అంటూ మరికొందరు నెగెటివ్ గా స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos