తినే ఆహారంలో ఎంత ఉప్పు ఉందో చెబుతుంది!

తినే ఆహారంలో ఎంత ఉప్పు ఉందో చెబుతుంది!

ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ డైట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే స్మార్ట్‌వాచ్‌ వంటి పరికరాలు వాడాల్సిందే. పరిమాణంలో అవి పెద్దగా ఉండటం, కొన్నిసార్లు వాటిని ధరించడం మర్చిపోతే డైట్‌కు సంబంధించిన విశ్లేషణ చేసుకోవడం కష్టం. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని దంతాలకు అమర్చుకునే విధంగా అతిచిన్న సెన్సార్లతో పనిచేసే స్మార్ట్‌ పరికరాన్ని తయారుచేశారు ఇంగ్లాండ్‌ మస్సాచుసెట్స్‌లోని టఫ్ట్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు. ఈ పరికరాన్ని శరీరభాగంలో ఇమడ్చడం కాకుండా, దంతంపై అమర్చుకునే విధంగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులోని సెన్సార్లు ఎప్పటికప్పుడు మనం తీసుకునే ఆహారానికి సంబంధించిన వివరాలన్నింటినీ నమోదు చేస్తుంటాయి.

ఎలా పనిచేస్తుందంటే..!

ఎటువంటి వైర్ల అనుసంధానం లేకుండా దంతాలపై ఉన్న ఎనామిల్‌ పొరపై సులభంగా అమర్చుకునే విధంగా ఈ పరికరం రూపొందిచారు. దీనిని మొబైల్‌తో అనుసంధానం చేసుకుని శరీరంలోకి తీసుకునే ఆహార పదార్థాల్లోని గ్లూకోజ్‌ పరిమాణం, రక్తంలోని ఆల్కాహాల్‌ పరిమాణం, ఉప్పుశాతాన్ని తేలికగా లెక్కించవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్‌ యాప్‌లో ఈ వివరాలన్నింటినీ తెలుసుకునే వీలుంది. రాబోయే కాలంలో శరీరంలోని రసాయనాలు, పోషకాలు, నోటి ఆరోగ్యాన్ని కూడా తెలిపే విధంగా ఈ పరికరాన్ని అభివృద్ధి చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. రేడియో తరంగాల సంకేతాలతో పనిచేసే ఈ పరికరం కేవలం 2మీమీ x 2మీమీ పరిమాణంలో ఉంటుంది. గతంలోనూ పరిశోధకులు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పటికీ సెన్సార్లలో తలెత్తిన లోపాల కారణంగా అవి విఫలమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos