తలసాని టార్గెట్లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే!

తలసాని టార్గెట్లో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే!

నంద్యాల వలె.. అనే టార్గెట్ తో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీచేసిన నియోజకవర్గాల విషయంలో పనిచేసింది. టీడీపీ తెలంగాణలో పోటీచేసిన పన్నెండు నియోజకవర్గాలకూ ఏపీ నుంచి ప్రత్యేకంగా ఇన్ చార్జిలు నియమితం అయ్యారు. కూకట్ పల్లి కోసం పెద్ద పెద్ద కమ్మోళ్లు రంగంలోకి దిగారు. ఆర్థికశక్తి, అంగబలం కలిగిన పరిటాల సునీత లాంటివాళ్లు  కూకట్ పల్లిలో మకాంపెట్టారు. అలాగే ఏపీలోని టీడీపీ కమ్మ రాజకీయ నేతలు కేరాఫ్ కూకట్ పల్లి అన్నట్టుగా రాజకీయం చేశారు. అయితే కూకట్ పల్లిలో టీడీపీ బండి బోల్తాపడింది.

ఇక శేరిలింగంపల్లి, సనత్ నగర్ వంటి నియోజకవర్గాల్లో కూడా కులాల వారీగా ఏపీ నుంచి ఇన్ చార్జిలు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అలా ప్రత్యేకంగా లక్ష్యంగా పెట్టుకున్న నియోజకవర్గం సనత్ సగర్. అక్కడ నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ పొలిటీషియన్ మర్రి శశిధర్ రెడ్డి ప్రయత్నించినా.. టీడీపీ ఒప్పుకోలేదు. మర్రి అక్కడ నుంచి వద్దు అని.. ఆ సీటు టీడీపీకే దక్కాలని బాబు తేల్చిచెప్పాడు. తన పార్టీ అభ్యర్థిని అక్కడ  నిలబెట్టాడు.

సనత్ నగర్ విషయంలో టీడీపీ, బాబు కసి పెరగడానికి ప్రత్యేక కారణం అక్కడ తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ తరఫున అంతకు ముందు ఎన్నికల్లో నెగ్గి ఫిరాయించి ఉండటం. మంత్రిగా తెలుగుదేశం పార్టీపై తీవ్రంగా విరుచుకుపడటం. చంద్రబాబును, బాలయ్యను మామూలుగా తిట్టలేదు తలసాని.

ఫిరాయింపుల విషయంలో వీళ్ల ద్వంద్వ నీతి మీద తలసాని దుమ్మెత్తిపోశాడు. దీంతో ఎటు తిరిగీ తలసానిని ఓడించాలని కంకణం కట్టుకున్నారు. తలసాని ఓడిపోయినట్టే అని ఎన్నికల ముందు ప్రచారం కూడా ముమ్మరం చేశారు. తలసానిని ఓడించడానికి ఏపీ నుంచి అనేకమంది నేతలు తరలి వెళ్లారు.

అలా సనత్ నగర్ ఇన్ చార్జిగా నియమితుడు అయ్యాడు తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఈయన ఇన్ చార్జిగా అక్కడ పంపకాల లెక్కలు చూశాడని సమాచారం. సనత్ నగర్ పరిధిలో నోట్లు పంచుతున్న తెలుగుదేశం కార్యకర్తలను తెరాస వాళ్లు పట్టుకున్నారు కూడా.

అది ఆఖర్లో. పంపకాలు పూర్తి అవుతున్న తరుణంలో ఏపీ నుంచి వెళ్లి అక్కడ నోట్లు పంచుతున్న కొంతమందిని పట్టుకుని తెరాస వాళ్లు పోలీసులకు అప్పగించారు. అది పెద్ద రచ్చ కూడా అయ్యింది. ఇలా తనను ఓడించడానికి ప్రత్యేకంగా నియమితుడు అయ్యి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు.. అని ఆలపాటి రాజాపై తలసానికి ప్రత్యేక కోపం ఉందని సమాచారం.

తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆలపాటికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తలసాని అనుకుంటున్నాడట. తెనాలిలో తలసాని సొంత సామాజికవర్గం వారి జనాభా గణనీయంగా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఆలపాటిని విషయంలో తలసాని ప్రత్యేకంగా కాన్సన్ ట్రేట్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తనను ఓడించాలని చూసిన ఆలపాటిని ఓడించడానికి… తలసాని కుల సమీకరణాలు వాడుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ- ఆంధ్రా అనే ప్రాంతీయ సమీకరణాలు చెరిగిపోయి, కుల సమీకరణాలే హైలెట్ అవుతున్నాయని ఇప్పుడు స్పష్టం అవుతోంది.

హైదరాబాద్ లో సెటిలైన ఆంధ్రా మూలాలున్న వాళ్లు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో ఆ విషయాన్ని తేటతెల్లం చేశారు. ఏపీలో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది! తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకుని జులుం చెలాయిస్తున్న కులంపై ఇతర కులాల వాళ్లంతా చాలా గుర్రుగానే కనిపిస్తున్నారు!

తాజా సమాచారం

Latest Posts

Featured Videos