తలసానికి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి సవాల్‌

  • In Local
  • January 22, 2019
  • 769 Views
తలసానికి టీడీపీ ఎమ్మెల్యే ఆలపాటి సవాల్‌

తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలో నేనేదో భయపడి తలసానికి ఫోన్‌ చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని… 24 ఏళ్ల వయస్సులో రాజకీయాల్లోకి వచ్చాను. ఇలాంటివి ఎన్నో చూశానని తెనాలి శాసనసభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై మండిపడ్డారు. గుంటూరులోని గ్రాండ్‌ నాగార్జున హోటల్‌లో సోమవరాం ఆయన విలేకర్లతో మాట్లాడారు. “నువ్వు నాకు ఫోన్‌ చేశావా… నేను నీకు ఫోన్‌ చేశానా.. నిరుపిస్తావా” అని తలసానికి సవాలు విసిరారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమనీ.. గెలుపు తలకెక్కకూడదని తలసానికి హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా వెళ్లి తమకు నచ్చిన వారికి ప్రచారం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో తెలుగుదేశం ఉంది… పార్టీ గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్లి ప్రచారం చేస్తానన్నారు. తలసాని సైతం తెనాలి వచ్చి ప్రచారం చేసుకోవచ్చన్నారు. అయితే రాజకీయాల్లో భాష ప్రధానమన్నారు. ఎవరొచ్చినా స్వాగతిస్తామని తాను కనుక తెనాలిలో ఓడిపోతే ఇక రాజకీయాల గురించి మాట్లాడనని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos