‘జాతీయ రహదారి నిర్మాణానికి మా భూములివ్వం’

వైరా(ఖమ్మం): జాతీయ రహదారి నిర్మాణం కోసం అవసరమైన భూముల సర్వే కోసం వెళ్లిన రెవెన్యూ అధికారులు, సిబ్బందిని రైతులు అడ్డగించారు. ఖమ్మంనుంచి అశ్వారావుపేటకు నాలుగులైన్ల జాతీయ రహదారి నిర్మాణంకోసం వైరా మండలంలో సోమవరం, గండగలపాడు, సిరిపురం గ్రామాల భూములను రైతులు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ భూముల సేకరణకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. రైతుల అభిప్రాయాలు కోరుతూ.. అధికారులు నోటీసులు జారీచేశారు. తమ భూములను ఇవ్వబోమని రైతులు ఇప్పటికే స్పష్టం చేశారు. జేసీ రైతుల నుంచి అభిప్రాయాలు స్వీకరించిన సమయం లోనూ తమ భూములు ఇచ్చేదిలేదని తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాలమేరకు రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులతో చర్చించినా.. వారు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వైరా తహసీల్దార్‌ జె.సంజీవా రెవెన్యూ సిబ్బందితో సోమవరం, గండగలపాడుగ్రామాల్లో భూముల సర్వేకు వెళ్లగా రైతులు అడ్డగించారు. జాతీయ రహదారికి తమ భూములిచ్చే ప్రసక్తేలేదని ఖరాకండీగా చెప్పారు. బలవంతంగా భూములు లాక్కొనేందుకు ప్రయత్నిస్తే.. తాము ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos