చైనా చంద్రయానం: చంద్రుని మీద మొలకెత్తిన పత్తి విత్తనం

చైనా చంద్రయానం: చంద్రుని మీద మొలకెత్తిన పత్తి విత్తనం

చాంగీ-4 అనే రోబోటిక్ అంతరిక్ష వాహనంలో ఇటీవల చంద్రుని మీదకు చైనా పంపిన పత్తి విత్తనాలు మొలకెత్తాయి. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేష్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.చంద్రుని మీద ఇలాంటి జీవ సంబంధమైన పరిణామం చూడటం ఇదే తొలిసారి. దీంతో అంతరిక్షంలో మరింత విస్తృతమైన పరిశోధనలు జరిపేందుకు కీలక అడుగు పడినట్లేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.గతంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మొక్కలు పెరిగాయి. కానీ, చంద్రుని మీద విత్తనాలు మొలకెత్తడం మాత్రం ఇదే తొలిసారి.చంద్రుడి ఆవలి వైపున, భూమిని ఎన్నడూ చూడని ‘అంధకార’ ప్రదేశంలో చాంగీ-4 విజయవంతంగా దిగిందని ఈ నెల 3న చైనా ప్రకటించింది.ఆ ప్రాంతంలోని పరిస్థితులను విశ్లేషించేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను చాంగీ-4 వాహనం తీసుకుని వెళ్లింది./అక్కడ జీవసంబంధమైన పరిశోధనలు జరిపేందుకు పత్తి విత్తనాలను, 3 కిలోల బరువున్న బంగాళాదుంపలు, అరబిడాప్పిస్ అనే పూల విత్తనాలు, యీస్ట్, పట్టుపురుగు గుడ్లను కూడా ఆ వాహనంలో చైనా శాస్త్రవేత్తలు పంపించారు.తాజా పరిశోధన మున్ముందు అంగాకర గ్రహం మీద కూడా ఇలాంటి ప్రయోగాలు చేసేందుకు ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.వ్యోమగాములు భూమి మీద నుంచి ఆహార పదార్థాలు తీసుకెళ్లాల్సిన పనిలేకుండా, అంతరిక్షంలోనే పండించుకునే దిశగా ఓ అడుగు పడిందని అంటున్నారు.పత్తి విత్తనం మొలకెత్తిన చిత్రాన్ని చైనా అధికార కమ్యూనిస్టు పార్టీకి చెందిన ‘పీపుల్స్ డైలీ’ పత్రిక ట్వీట్ చేసింది. చంద్రుని మీద మానవుడు చేపట్టిన మొట్టమొదటి జీవ సంబంధమైన ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది.ఇదొక “శుభ వార్త” అని ఆస్ట్రేలియా అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి చెందిన శాస్త్రవేత్త ఫ్రెడ్ వాట్సన్ అన్నారు.”ఇక చంద్రుని మీద వ్యోమగాములు తమకు కావాల్సిన పంటలు పండించుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న విషయం దీనితో అర్థమవుతోంది” అని వాట్సన్ అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos