కర్కశం తెరపైనే..

  • In Film
  • February 9, 2019
  • 152 Views
కర్కశం తెరపైనే..

ఒకప్పటికి ఇప్పటికి అసలు పోలికే లేదు. అప్పట్లో మనుషుల్లో కొన్ని నీతినియమాలు ఉండేవి. మానవత్వం విలువలు కనిపించేవి. ఈరోజుల్లో అంతా కమర్షియల్ మైండ్ సెట్.. దానధర్మాల్లోనూ నాటి సన్నివేశం లేదు. దాచుకోవడం.. దోచుకోవడం తప్ప వేరొక ఆలోచనే లేదు. `మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్.. మా ఇంటికొస్తే ఏం తెస్తావ్!“ అని గ్రేట్ ప్రొడ్యూసర్ కీ.శే వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నట్టుగానే ఉంది సన్నివేశం. అయితే మన స్టార్ హీరోల్లో కొందరు ప్రకృతి వైపరీత్యాల వేళ ప్రజల్ని ఆదుకునేందుకు తమకు అంతటి స్థాయినిచ్చిన అభిమానుల్ని ఆదుకునేందుకు ముందుకు రావడం అన్నది ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది.

21వ శతాబ్ధంలో ఉన్నాం. కలియుగం ఇది. ఇలాంటి రోజుల్లో భూములు దానమిచ్చే గొప్ప మనసున్న స్టార్లు ఉన్నారా?  ఆ ఊహే చాలా కష్టం. నేటి సన్నివేశంలో గజం భూమి కూడా దానమివ్వలేరు. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట భూమి దానమివ్వాలంటే కోట్లకు కోట్లు దానమివ్వడమే. ఇంకా చెప్పాలంటే ధాతృత్వం చాటుకునేందుకు.. దానమిచ్చేందుకు గజం భూమి కూడా హైదరాబాద్ లో కానీ – ఫిలింనగర్ – కృష్ణానగర్ లో కానీ లేనేలేదు. ఔట్ స్కర్ట్స్ మొత్తం కబ్జాల్లోనే ఉంది. ఇలాంటి సన్నివేశంలో 600కోట్ల విలువ చేసే భూమిని దానమిచ్చిన నటుడు ఉన్నాడంటే నమ్మగలరా? ఆరోజుల్లో ఓ పేరున్న విలన్ ఏకంగా 10 ఎకరాల భూమిని టాలీవుడ్ కి దానమిచ్చారు. అప్పట్లో ఆ భూమి ధర వేలు.. లక్షల్లో మాత్రమే. కానీ ఇప్పుడు ఎకరం ఖరీదు ఇక్కడ 60కోట్లు. దానమిచ్చిన ఆ పది ఎకరాల విలువ సంఖ్యా పరంగా రూ.600కోట్లుగా గణిస్తున్నారు. అక్షరాలా ఆరు వందల కోట్లు. ఈ మొత్తం కళ్లు భైర్లు కమ్మేదే. అది కూడా హైదరాబాద్ నగరానికి హార్ట్ ఆఫ్ ది సిటీగా చెప్పుకునే గచ్చిబౌళికి కూతవేటు దూరంలో ఈ భూమి ఉంది.అత్యంత ఖరీదైన ప్రైమ్ ఏరియాలో 10 ఎకరాలు దానమిచ్చిన ఆ మహానుభావుని పేరు డా.ఎం.ప్రభాకర్ రెడ్డి. సినిమా 24 శాఖల కార్మికుల కోసం ఆయన ఈ దానం చేశారు. ఎన్టీఆర్ – ఏఎన్నార్ – ఎస్వీఆర్ – శోభన్ బాబు – కృష్ణ – చిరంజీవి వంటి స్టార్లు రాజ్యమేలుతున్న రోజుల్లో సమాంతరంగా ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారు 25-11-1997లో  మరణించారు. ఆయన బతికి ఉన్నన్నాళ్లు ఎందరికో ఎన్నో రకాల సాయం చేశారట. సలహా అడిగిన నటులు ఎందరికో అవకాశాలిప్పించిన మహానుభావుడు అని చెబుతారు. కార్మికుల ఆవాసం కోసం చిత్రపురి కాలనీకి 10 ఎకరాల దానం ఇచ్చారాయన. గచ్చిబౌళి ప్రైమ్ ఏరియాలో ఉన్న ఈ చోట ఎకరం 60కోట్ల విలువ ఉందిప్పుడు. ఆయన ఇచ్చిన పది ఎకరాలకు మరో 30 ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేసి చిత్రపురి కాలనీని నిర్మించారు. సరిగ్గా చిత్రపురి కాలనీకి అర కిలోమీటరు దూరంలో హైవేని ఆనుకుని ఏకంగా 30 వేల కోట్ల విలువైన భారీ మాల్స్ మల్టీప్లెక్సులు నిర్మితమవుతున్నాయి. ఈ ఏరియాలో ఎకరం రూ.60 కోట్ల చొప్పున కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక్క డీల్ సెట్ చేసినందుకు మధ్యవర్తి (బ్రోకర్ ) ఎకరానికి కోట్లలో పర్సంటేజీ రూపంలోనే దక్కుతోందిట. ప్రస్తుతం సినీకార్మికులు నివాసం ఉంటున్న చిత్రపురి కాలనీలో ఒకప్పుడు కొండలు బండ రాళ్లు తుప్పులు మాత్రమే ఉండేవి. నానక్ రామ్ గుడ రామానాయుడు స్టూడియోస్ కి వెళ్లాలంటే గతుకుల రోడ్ ఉండేది. కానీ ఇప్పటి సీనే వేరు. సిటీలోనే కాస్ట్ లీ హబ్ గా మారింది ఈ ఏరియా. ఇప్పుడు అది సిటీలోనే ది బెస్ట్ గా తయారైంది. ఆసక్తికరంగా చిత్రపురికి 2 కి.మీల దూరంలో హైదరాబాద్ నగరానికే అత్యంత కాస్ట్ లీ మాల్- మల్టీప్లెక్స్ గా చెప్పుకునే ఇనార్బిట్ మాల్ ఉంది. సిటీ బెస్ట్ పోలీస్ స్టేషన్ ని ఇనార్బిట్- చిత్రపురి మధ్యలోనే నిర్మిస్తున్నారు. ఇదే చోట ఇటీవలే ప్రతిష్ఠాత్మక ఐకియా స్టోర్ ప్రారంభమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos