ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు!

  • In Film
  • February 8, 2019
  • 88 Views
ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు!

మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ పుణ్యమా అని ఆమె నటించిన ‘ఒరు అడార్‌ లవ్‌’కు కూడా మంచి ప్రచారం దక్కుతోంది. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్‌ కన్నుగీటిన సన్నివేశం ఎంత వైరల్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాంతో సినిమాను తెలుగులోనూ విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ప్రేమికుల రోజు సందర్భంగా ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘ఒరు అడార్ లవ్’ మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

36.8 శాతం మంది ఈ సినిమా కోసమే ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ సింగ్ నటించిన ‘గల్లీ బాయ్‌’ ఉంది. మూడో స్థానంలో ‘కళా షా కళ’, నాలుగులో ‘లుకా చుప్పి’, ఐదులో ‘మెంటల్‌ హై క్యా’ సినిమాలు ఉన్నాయి. ఈ జాబితాలో సినిమాల స్థానాలు మారుతుంటాయి. కానీ ఏ విధంగా చూసినా ‘ఒరు అడార్‌ లవ్‌’ సినిమా టాప్‌5 చిత్రాల్లో ఉంటోందని ఐఎండీబీ అంటోంది. ఇటీవల విడుదలైన ‘లవర్స్‌ డే’ టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఈ టీజర్‌ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఒమర్‌ లులు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos