ఆరోగ్యానికి అరటి..

ఆరోగ్యానికి అరటి..

ఏ సీజన్లోనైనా విరివిగా లభించే అరటి పండ్లతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.వీటితో తక్షణమే శక్తి లభిస్తుంది.
అరటి పండ్లు తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.అరటి పండ్లు ఏ సీజన్లోనైనా విరివిగా లభిస్తాయి. సామాన్యుడికి అందుబాటు ధరలో లభించే అరటి పండ్లలో బోలెడు పోషకాలున్నాయి. చక్కెరకేళి, అమృతపాణి… ఇలా మన దేశంలో బోలెడు రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి. అరటి పండులో శరీరానికి సరిపడా కాల్షియం, ఐరన్ ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం బీపీని తగ్గించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. పిల్లల ఎదుగుదలకు కూడా అరటి ఉపయోగపడుతుంది. అరటి పండ్లలో విటమిన్ ఎ, బి, సి పుష్కలంగా ఉంటాయి. అరటి పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. తిన్న తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. బరువు పెరగాలని అనుకునే వారికి అరటి పండ్లు తింటే ప్రయోజనం లభిస్తుంది. కండరాల బలహీనతను నివారించడంలో అరటిపండ్లు తోడ్పడతాయి. వ్యాధి నిరోధక శక్తి పెంపొందడంలో.. ఎసిడిటీని దూరం చేయడంలో, అల్సర్లను తగ్గించడంలో అరటి పండు కీలక పాత్ర పోషిస్తుంది. అరటి పండ్లలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మలబద్ధకం సమస్య దూరం కావడానికి ఇవి ఉపయోగపడతాయి. డయేరియాతో బాధపడేవారు అరటి పండ్లు తింటే మంచిది. జీర్ణాశయం గోడలకు ఉండే సన్నటి పొర నాశనం కాకుండా అరటి కాపాడుతుంది. అరటి పండు కండరాలు పట్టివేయడాన్ని నివారిస్తుంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos