అమ్మాయిల కన్యత్వం, సీసా సీల్‌కు సంబంధం ఏమిటి? :

అమ్మాయిల కన్యత్వం, సీసా సీల్‌కు సంబంధం ఏమిటి? :

అమ్మాయిల కన్యత్వంపై అబ్బాయిలకు అవగాహన ఉండడం లేదని జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఇటీవల వ్యాఖ్యానించారు.”కన్యలు మూత తెరవని సీసాల్లాంటివారు. ఓపెన్ చేసిన కూల్ డ్రింక్ కానీ, చించేసిన బిస్కెట్ ప్యాకెట్ కానీ మీరు కొంటారా?” అని ఫేస్‌బుక్ వేదికగా తాను రాసిన పోస్టింగ్‌లో ఆయన యువకులను ఉద్దేశించి ప్రశ్నించారు.అమ్మాయిలను ఇలా పోల్చడం, కోరిక తీర్చుకోవడానికి పనికొచ్చే వస్తువులా చూపడం ఇదే తొలిసారి కాదు.బైక్‌లు, కార్లను అందమైన అమ్మాయిల్లా ఊహించుకుంటున్న పురుషులను చూపించే వ్యాపార ప్రకటనలూ ఉన్నాయి. బీరు బాటిళ్ల ఆకృతిని అమ్మాయిల ఒంపుసొంపులతో పోల్చుతూ చూపించే వ్యాపార ప్రకటనలూ ఉన్నాయి.కేవలం లైంగిక దృష్టితో చూడడం, వస్తువుల్లా చూడడం ఇలాంటి విషయాల్లో కనిపిస్తుంది. కూల్ డ్రింక్ సీసా, బిస్కెట్ ప్యాకెట్ల ఆకారం కంటే అది అప్పటికే ఉపయోగించిన వస్తువా కాదా అన్నది చర్చించడం ప్రొఫెసర్ వ్యాఖ్యల్లో ప్రధానంగా కనిపిస్తుంది.ఎన్నడూ లైంగికానుభవం లేకుండా శీలవతిగా, కన్యగా ఉన్న అమ్మాయిలే పరిశుద్ధమైనవారన్న భావన అందులో ఉంది.ఆ ప్రొఫెసర్ ఫేస్‌బుక్ పోస్ట్ ప్రకారం పెళ్లి వరకు కన్యగా ఉండి భర్తతో మాత్రమే తొలి లైంగిక అనుభవం ఉంటే ఆ అమ్మాయి దేవతలాంటిది.

కన్యత్వ పరీక్ష

కంగారు పడకండి. పెళ్లికి ముందు సెక్స్‌‌ ఫరవాలేదని నేనేమీ చెప్పడం లేదు, అది వారివారి ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది.అయితే, ఇది కేవలం సామాజిక విలువలకు సంబంధించిన హెచ్చరికా లేదంటే కేవలం శీలం పేరుతో వేస్తున్న ముసుగా అన్నదే కీలకం.మహిళలు తమ వాంఛలను స్వేచ్ఛగా బయటపెట్టుకుంటూ, తీర్చుకుంటారేమోనన్న భయంతో ఈ సామాజిక, నైతిక విలువలన్న ముసుగు వేస్తున్నారు అబ్బాయిలు పెళ్లి వరకు బ్రహ్మచారులుగానే ఉన్నారా లేదా అన్నదానికి లెక్కేమీ లేదు, అంతేకాదు విలువల ఒత్తిడీ వారిపై లేదు.పెళ్లికి ముందు కానీ, తరువాత కానీ తమ శీలం తెంచుకొనే స్వేచ్ఛ వారికి ఈ సమాజంలో ఉంది.ఈ ప్రొఫెసర్ కూడా వారికేమీ సూచనలు కానీ, హెచ్చరికలు కానీ చేయలేదు.మరి, అమ్మాయిలు కూడా తమ కోరికలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తూ కొంటెపనులు చేయాలనుకుంటే ఏమవుతుంది?మహారాష్ట్రలోని ఒక తెగలో పెళ్లయిన తరువాత తొలిరాత్రి వధువుకు కన్యత్వ పరీక్ష చేసే ఆచారం ఉంది. నవదంపతులు తొలి రాత్రి గడిపిన తరువాత వారి పడకపై ఉన్న దుప్పటిపై రక్తం మరక ఉందో లేదో చూసి పెళ్లికూతురు కన్యో కాదో నిర్ణయిస్తారు.ఆ తెగలోని కొందరు పురుషులు ఇప్పుడీ ఆచారానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos