అభినందన్‌ విడుదల వద్దు

ఇస్లామాబాద్‌: భారత
వైమానిక దళం పైలట్, వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయకుండా పాక్ ప్రధాని
ఇమ్రాన్ ఖాన్‌కు ఆదేశించాలని కోరుతూ పాక్‌ ఉన్నత న్యాయస్థానంలో శుక్రవారం వ్యాజ్యం
దాఖలైది. పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్న నాలుగో అధీకరణ ప్రకారం అభినందన్‌పై పొరుగు
దేశం నుంచి పాక్‌ పై యుద్ధం చేయడానికి వచ్చిన  నేరగాడుగా క్రిమినల్‌ కేసు దాఖలు చేసిన విచారణ
జరిపించాలని విన్నవించారు.  దీనిపై విచారణ చేపట్టిన
ఇస్లామాబాద్‌ న్యాయ స్థానం ఈ వ్యాజ్యానికి ఎటువంటి విచారణ అర్హత లేదని పేర్కొంటూ కొట్టి
వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos