అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటే…..

అధిక బ‌రువు త‌గ్గాల‌నుకుంటే…..

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఇందుకు పాటిం చాలి్ల్సిన సూచ‌న‌లు ఇప్పుడు తెలుసుకుందామా..! 

1. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌ను త‌ప్పిస్తే అధిక బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని భ్ర‌మ‌ప‌డుతుంటారు. ఇది ఎంత‌మాత్రం నిజం కాదు. ఉద‌యం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. లేదంటే రోజులో త‌రువాతి స‌మ‌యాల్లో అధికంగా ఆహారం తీసుకుంటార‌ని, దాంతో అధిక బ‌రువు పెరుగుతార‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. కాక‌పోతే అందులో ప్రోటీన్లు, ఫ్యాట్లు స‌మ‌పాళ్ల‌లో ఉండేలా చూసుకోవాలి. 2. చాలా మంది నిత్యం వ్యాయామం చేస్తున్నాం క‌దా అని చెప్పి జంక్ ఫుడ్ బాగా లాగించేస్తుంటారు. అది మంచిది కాదు. వ్యాయామం చేసినా స‌రే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. జంక్ ఫుడ్ శ‌రీరానికి చేటు తెస్తుంది. బ‌రువును పెంచుతుంది. క‌నుక ఆ ఫుడ్‌ను మానేయాలి. 3. అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు శీత‌ల పానీయాల‌ను మానేయాలి. ఇవి బ‌రువును పెంచుతాయి. 4. వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండాలి. ఆ స‌మ‌యంలో శ‌రీరం మ‌ర‌మ్మ‌త్తులు చేసుకుంటుంది. మెట‌బాలిజం క్ర‌మ‌బ‌ద్దీక‌రింప‌బ‌డుతుంది. క‌నుక వారంలో ఒక రోజు క‌చ్చితంగా ఉప‌వాసం చేస్తే అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. 5. నేడు మార్కెట్‌లో మ‌న‌కు బ‌రువును త‌గ్గిస్తామ‌ని చెప్పి చాలా మంది ర‌క ర‌కాల మెడిసిన్ల‌ను అమ్ముతున్నారు. వాటిని న‌మ్మ‌రాదు. అవి బ‌రువును త‌గ్గించ‌వు స‌రిక‌దా, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను తెచ్చి పెడ‌తాయి. క‌నుక వాటి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి. 6. కొంద‌రు బాగా ఎక్స‌ర్‌సైజ్ చేస్తే అధికంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని భ్ర‌మిస్తుంటారు. అది నిజం కాదు. శ‌రీరానికి ఎంత వ్యాయామం అవ‌స‌రం అని భావిస్తారో అంత వ‌ర‌కే వ్యాయామం చేయాలి. దీని వ‌ల్ల బ‌రువు తగ్గుతారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos