అచ్చుగుద్దినట్లు ఉన్నాడుగా…

  • In Film
  • February 9, 2019
  • 131 Views
అచ్చుగుద్దినట్లు ఉన్నాడుగా…

బాహుబలి 2- హిందీ వెర్షన్ ఫుల్ రన్ వసూళ్ల రికార్డును అధిగమించిన లేటెస్ట్ మూవీ `ఊరి:  ది సర్జికల్ స్ట్రైక్స్`. ఈ సినిమా సాధించిన విక్టరీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. రిలీజైన 25 వ రోజు బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేసింది. ఈ శుక్రవారంతో ఈ సినిమా 200కోట్ల క్లబ్ లో చేరింది. 2019లో 200 కోట్లు వసూలు చేసిన తొలి సినిమాగా `ఊరి` రికార్డులకెక్కింది. అయితే ఈ సినిమా సాధిస్తున్న రికార్డుల గురించి – ప్రముఖుల ప్రశంసలు గురించి కంటే ఇందులో నటించిన యంగ్ హీరో విక్కీ కౌశల్ గురించి కచ్ఛితంగా మాట్లాడుకుని తీరాలి.

రూపురేఖలు – నటన – ఆహార్యం ఇలా అన్ని విభాగాల్లో ఏ ఇతర బాలీవుడ్ హీరోతో పోల్చినా విక్కీ కౌశల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. పైగా సౌత్ కి సూటబుల్ అనిపించే లుక్ అతడికి ఉంది. వీటికి తోడు 300 హీరో జెరార్డ్ జేమ్స్ బట్లర్ ని పోలి కనిపిస్తున్నాడు. అతడి ముఖాకృతి – ఆహార్యం – శరీర దారుఢ్యం ప్రతిదీ సేమ్ టు సేమ్ 300 హీరోని పోలి కనిపిస్తున్నాడు. ఊరిలో విక్కీ కౌశల్ గడ్డం లుక్ అచ్చం బట్లర్ నే తలపించింది. ఇక ఆ సినిమాలో ఆర్మీ అధికారిగా వార్ సన్నివేశాల్లో విక్కీ ఆహార్యం సైతం అచ్చం బట్లర్ తరహా లో కనిపించడం ఓ హైలైట్.ఈ యంగ్ హీరోకి బాలీవుడ్ తో పాటు ఇటు సౌత్ పరిశ్రమల్లోనూ అతి పెద్ద కెరీర్ ఉందని అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు కరణ్ జోహార్ తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం `తక్త్` లో అతడు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విక్కీ కౌశల్ ఇదివరకూ కియరా అద్వానీ నటించిన `లస్ట్ స్టోరీస్`లోనూ ఓ  ముఖ్య పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత తాప్సీతో కలిసి `మన్మార్జియాన్` చిత్రంలో అద్భుత నటనతో మైమరిపించాడు. తాజాగా ఊరి చిత్రంతో రికార్డ్ బ్రేకింగ్ హిట్ కొట్టాడు. తర్వాత ఓ హారర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇకపోతే ఈ యంగ్ హీరో లుక్ సౌత్ సినిమాకి పెర్ఫెక్ట్ యాప్ట్ కాబట్టి మునుముందు అతడికి టాలీవుడ్ నుంచి మల్టీస్టారర్లలో ఆఫర్లు వరించే ఛాన్సుంటుంది. ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించే మల్టీస్టారర్లకు విక్కీ లాంటి హీరో ప్లస్ అవుతాడనడంలో సందేహమే లేదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos