అఖిల్, హలో మరిచిపోండి.. ఇదే నాకు సరైన మూవీ

  • In Film
  • January 24, 2019
  • 739 Views
అఖిల్, హలో మరిచిపోండి.. ఇదే నాకు సరైన మూవీ

అఖిల్ సినిమా వచ్చింది. డిజాస్టర్ అయింది. ఆ తర్వాత హలో సినిమా వచ్చింది. హలో సినిమా టైమ్ లో నాగార్జున ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అఖిల్ సినిమాను మరిచిపోండి… తన కొడుక్కి హలో సినిమానే డెబ్యూ మూవీ అని ఊదరగొట్టాడు. అఖిల్ కు అసలైన ఎంట్రీ హలో సినిమానే అన్నాడు. కట్ చేస్తే అది కూడా ఫ్లాప్ అయింది. ఇప్పుడు అఖిల్ నుంచి మూడో సినిమా వస్తోంది.ఈసారి అఖిల్ గత రెండు సినిమాల్ని మరిచిపోమంటున్నాడు. అఖిల్, హలో మరిచిపోండి. నాకు సరైన సినిమా మిస్టర్ మజ్ను. ఈ సినిమాలో నా నుంచి మీరు కచ్చితంగా కొత్తదనం ఆశించొచ్చు. బాడీ లాంగ్వేజ్, డిక్షన్, యాక్షన్ ఇలా ప్రతి విషయంలో కొత్తదనం కోసం ప్రయత్నించాం. ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో తారక్ అన్నయ్య చెప్పినట్టు నన్ను నేను ఆత్మవిమర్శ చేసుకున్నాను. అందులోంచి వచ్చిందే మిస్టర్ మజ్ను సినిమా.అఖిల్ మొదటి సినిమాను నాగార్జున మరిచిపోమంటే.. రెండో సినిమాను అఖిల్ మరిచిపోమంటున్నాడు. ఈ మూడో సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు. తన వయసుకు లవ్ స్టోరీలే కరెక్ట్ అంటున్న అఖిల్.. మరో ఐదేళ్ల పాటు ప్రేమకథలే తీస్తానని స్పష్టంచేశాడు.తారక్ నుంచి మాస్ యాక్టింగ్ నేర్చుకోమని మొన్న ఫంక్షన్ లో నాన్న చెప్పారు. అది ఎలా నేర్చుకోవాలో నాకు తెలియదు. కుదిరితే మళ్లీ డాడీనే అడగాలి. అయినా నా ఏజ్ కు లవ్ స్టోరీలే బాగుంటాయి. ఓ ఐదేళ్ల తర్వాత ఎలాగూ ప్రేమకథలు చేయలేను కదా.ఇకపై సినిమాల విషయంలో గ్యాప్ ఇవ్వనంటున్న అఖిల్, తన నెక్ట్స్ సినిమాను మార్చి నుంచి సెట్స్ పైకి తీసుకొస్తానని ప్రకటించాడు. 2-3 కథలు విన్నానని, వాటిలోంచి ఒకటి ఫైనల్ చేసి త్వరలోనే ప్రకటిస్తానని తెలిపాడు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos