పన్ను ఎగవేతకు నరేశ గోయల్‌ యత్నం

పన్ను ఎగవేతకు నరేశ గోయల్‌ యత్నం

ముంబై: జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌కు ఆదాయపు పన్ను శాఖ పన్ను ఎగవేత తాఖీదుల్ని శనివారం జారీ చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రూ.650 కోట్ల పన్ను ఎగవేసినట్లు ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు వచ్చాయి. నిరుడు సెప్టెంబరులో ముంబయిలో జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆఫీస్‌లో అధికారులు సోదాలు జరిపి పలు దస్త్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరిలో దర్యాప్తు ముగియటంతో సంబంధిత నివేదికను అంచనా విభాగానికి పంపించారు. జెట్‌ ఎయిర్ వేస్‌, దుబాయిలోని ఎయిర్ లైన్‌ గ్రూప్‌ కంపెనీ మధ్య అక్రమ లావాదేవీలు జరిగాయని దర్యాప్తులో తేలింది. దుబాయిలోని జనరల్‌ సేల్స్‌ ఏజెంట్‌కు జెట్‌ ఎయిర్‌వేస్‌ ఏటా భారీ మొత్తంలో కమిషన్లు ముట్ట జెప్పినట్లు నివేదికలో పేర్కొన్నారు. చెల్లింపులుఆదాయపు పన్ను చట్టం పరిమితులను దాటినట్లు తేలింది. ‘జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్‌ త్రై మాసిక ఆర్థిక ఫలితాల ప్రకటనకు ఆలస్యం చేస్తున్న దశలో ఈ దర్యాప్తు జరిగింది. పన్ను ఎగవేతకు నిధుల్ని విదేశాలకు మళ్లించాలనే ఉద్దేశంతోనే ఈ చెల్లింపులు జరిగాయి. దీనిపై ప్రశ్నించేందుకు గోయల్‌కు సమన్లు జారీ చేసామని అధికారులు తెలిపారు. ఈ వార్తపై స్పందించేందుకు జెట్‌ ఎయిర్‌వేస్‌ నిరాకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos