అద్దె ఇళ్ల యజమానులకు తీపి కబురు..

అద్దె ఇళ్ల యజమానులకు తీపి కబురు..

ఇకపై ఇల్లు అద్దెకు ఇచ్చే యజమానులు,ఇల్లు అద్దెకు తీసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన కొత్త అద్దె చట్టంలో నియమ నిబంధనలు ఆలా ఉన్నాయ్ మరి.దేశంలో ఎక్కడైనా ఇకపై అద్దెకు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, ఓనర్, టెనెంట్ మధ్య పరస్పర రాతపూర్వక అంగీకారం తప్పనిసరి. ఇదే సమయంలో ఏదైనా వివాదం ఏర్పడితే పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ క్వాసీ జ్యుడీషియల్ మెకానిజం సిద్ధంగా ఉంటుంది. నివాస ప్రాంతాల్లో గరిష్ఠంగా రెండు నెలల అద్దె, వాణిజ్య ప్రాంతాల్లో ఆరు నెలల అద్దె అడ్వాన్స్ మించరాదు.ఇక పలు ఢిపాల్ట్ నిబంధనలను కూడా కేంద్రం ఈ ముసాయిదాలో చేర్చింది. అద్దె చెల్లించడంలో విఫలమైతే, టెనెంట్, తదుపరి వడ్డీతో సహా అద్దెను చెల్లించాల్సి వుంటుంది. తొలుత ఒప్పందం చేసుకున్న ప్రకారం ఇంటిని ఖాళీ చేయడంలో విఫలమైతే, మొదటి రెండు నెలల అద్దె రెట్టింపవుతుంది. ఆపై నెలకు నాలుగు రెట్ల అద్దెను చెల్లించాల్సి వస్తుంది. వివాదాల సత్వర పరిష్కారానికి జిల్లా స్థాయిలో ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తారు. జిల్లా న్యాయమూర్తి లేదా అదనపు జిల్లా న్యాయమూర్తి వీటిని విచారిస్తారు. తీర్పు తమకు వ్యతిరేకంగా ఉందని భావించిన వారు అపీలు కూడా చేసుకోవచ్చు.చదువు, ఉద్యోగం, వ్యాపారం తదితరాల కోసం పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో, కొత్త అద్దె చట్టం అవసరమని భావిస్తున్నామని, గృహ సముదాయం, పరిమాణం, నాణ్యతల ఆధారంగా అద్దె నిర్ణయాలు జరుగుతుండటంతో గృహ యజమానులు నిరుత్సాహంగా ఉన్నారని కేంద్రం ఈ ముసాయిదాలో పేర్కొనడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో సౌకర్యాలు లేకున్నా అధిక అద్దెలు చెల్లించాల్సి వస్తోందని, మరికొన్ని చోట్ల అన్ని సౌకర్యాలున్నా, తక్కువ అద్దెలే వస్తున్నాయని తెలిపింది.దీనిపై అన్ని రాష్ట్రాలూ అభిప్రాయాలను తెలపాలని కోరుతూ అక్టోబర్ 31 వరకూ సమయం ఇచ్చింది. ఈ లేఖను అందుకున్న తెలంగాణ పురపాలక శాఖ 15 రోజుల్లో తమ అభిప్రాయాలను తెలియజేయాలంటూ ప్రజలను కోరింది. ఇక ఈ ముసాయిదాను యజమానులు, అద్దెలకు ఉండేవాళ్ల హక్కులకు సమానమైన ప్రాధాన్యతను ఇ

తాజా సమాచారం

Latest Posts

Featured Videos