జీఐశాట్‌–1 ప్రయోగానికి క్షణాల లెక్కింపు

జీఐశాట్‌–1 ప్రయోగానికి క్షణాల లెక్కింపు

బెంగళూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 5.43 గంటలకు జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్ఎల్వీ–ఎఫ్10) నింగిలోకి దూసుకెళ్లనుంది. బుధవారం సాయంత్రం 3.43 గంటలకు కౌంట్డౌన్ ప్రారంభం. రాకెట్లోని అన్ని దశలకు తుది విడత పరీక్షలు పూర్తి చేసారు. జీఐశాట్–1 ఉపగ్రహాల్లో ఇది మొట్టమొదటిది. బుధవారం సాయంత్రం రాకెట్ రెండో దశలో ద్రవ ఇంధనం నింపటాన్ని ఆరంభిస్తారు. గురువారం ఉదయం నుంచి రాకెట్కు హీలియం, నైట్రోజన్ వాయువుల్ని నింపుతారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. సాయంత్రం 5.43 గంటలకు 2,268 కిలోల బరువు కలిగిన జియో ఇమేజింగ్ శాటిలైట్ (జీఐశాట్)–1 ఉపగ్రహాన్ని మోసుకుని జీఎస్ఎల్వీ ఎఫ్–10 రాకెట్ నింగికి దూసుకు వెళ్తుంది. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన జీఐశాట్–1 ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని భూ స్థిర కక్ష్య లో ప్రవేశపెట్ట నున్నారు. భూ పరిశోధనలకు ఇప్పటి వరకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ (దూర పరిశీలనా ఉపగ్రహాలు)ను భూమికి 506 – 830 కి.మీ ఎత్తులో సూర్యానువర్థన ధృవకక్ష్య లోకి పంపేవారు. ఈసారి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ను మొదటి సారిగా భూ స్థిర కక్ష్యలోకి పంపుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos