తువ్వాలు సరి పోతుంది

తువ్వాలు సరి పోతుంది

అగర్తలా: కరోనాను బారిన పడకుండా తప్పించుకునేందుకు ముసుగులకు బదులుగా తువ్వాళ్లు కట్టుకోవాలని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లాబ్ కుమార్ శనివారం ఇక్కడ సెలవిచ్చారు. ‘ఆసుపత్రిలో పని చేసే వారికి, లేదా క్వారెంటైన్లో ఉన్న వారికే మాస్కులు అవసరం. అంతే కానీ, మాస్కులు ధరించకపోతే కోవిడ్-19 సోకుతుందని మీరు భయపడుతున్నారు అంతే. ఆసుపత్రుల్లో పని చేసే వారికి సరిపడా మాస్కులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది ప్రజలకు మాస్కులు పంచడం ప్రభుత్వానికి సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి నేను అందరిని కోరేది ఏంటంటే.. ముందు జాగ్రత్త చర్యగా మాస్కుల బదులుగా తడిపిన తువ్వాలును ధరించండి’’ అని హితవు పలికారు. లాక్డౌన్ సమయంలో ఖాళీగా ఉండకుండా ప్రజలు తమ ఆత్మకథలను రాయాలని కోరారు. ‘ఈ 21 రోజుల్లో మీరు మంచి రచయితగా మారిపోవచ్చు. మీ ఆత్మకథను రాయండి.. అప్పుడు 21 రోజులు 21 సెకన్లుగా గడిచిపోతాయ’న్నారు. త్రిపురలో ఇప్పటివరకూ 948మందిని క్వారెంటైన్లో ఉంచాం. ఇప్పటివరకూ ఒక పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos