నామినేషన్ వేస్తుండగా సీపీఐ ఎంఎల్ అభ్యర్థి అప్తాబ్ ఆలం అరెస్ట్

నామినేషన్ వేస్తుండగా సీపీఐ ఎంఎల్ అభ్యర్థి అప్తాబ్ ఆలం అరెస్ట్

పట్నా (బీహార్): ముజప్ఫర్ పూర్ జిల్లాలోని ఔరాయి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మహాఘట్ బంధన్ కూటమి పక్షాన పోటీకి నామినేషన్ సమర్పించేందుకు వచ్చిన సీపీఐ ఎంఎల్ అభ్యర్థి అప్తాబ్ ఆలంను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసారు. నామినేషన్ సమర్పిస్తున్న దశలో అరెస్టు చేసినందుకు విమర్శలు వెల్లువెత్తాయి. దీపక్ రాయ్ హత్యకు వ్యతిరేకంగా తాము శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసినందుకే తనపై కేసు పెట్టి అరెస్టు చేసారని, ఇది రాజకీయ కుట్ర అని ఆలం ఆరోపించారు. అప్తాబ్ఆలం పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయినందున అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos