ఆయన చెప్పినట్లే దూబే హతం

ఆయన చెప్పినట్లే దూబే హతం

న్యూ ఢిల్లీ: ‘వికాస్ దూబే అనూయాయల్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు మట్టుబెట్టిన రీతిలోనే అతణ్నీ హతమార్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దూబేను యూపీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారంటే అతడు కచ్చితంగా హతమైపోతాడు. పోలీసులు పాత ఎన్కౌంటర్ కథనే మళ్లీ చెబుతారు’’ అని ముంబైకి చెందిన న్యాయవాది ఘణ్శ్యామ్ ఉపాధ్యాయ్ గురువారం సాయంత్రం అత్యున్నత న్యాయస్థానానికి దాఖలు చేసిన వ్యాజ్యంలో పేర్కొన్నారు. శుక్రవారం ఇదే నిజమైంది. ‘కరుడు గట్టిన నేరగాడు దూబేపై నాకు సానుభూతి ఏమీ లేదు. .. అఫ్జల్ గురు, అజ్మల్ కసబ్ వంటి దోషుల విషయంలో జరిగినట్లుగానే చట్టపరంగా విచారణ జరగాలని తాను కోరుకుంటున్నాను. యూపీ పోలీసుల చేతిలో దూబే అంత సులభంగా మరణం పొందేందకూడదు. ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదనేదే నాన ఉద్దేశమ’ని పేర్కొన్నారు. ‘పోలీసుల పై దాడికి దిగిన దూబేకు పోలీస్ స్టేషన్ నుంచే సమాచారం అందింది. పలువురు ఉన్నతాధికారులతో అతడికి సంబంధం ఉందన్న వార్తల నేపథ్యంలో.. తమ పాలిట భస్మాసురుడిగా మారిన అతణ్ని యూపీ పోలీసులు హతం కావడం ఖాయం. దూబే అనుచరుల కాల్చివేతపై సీబీఐ విచారణ జరపాలి. అతడి అరాచకాల్లో పరోక్షంగా పాలుపంచుకున్న రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకోవాల’ని విన్నవించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos