మాల్యాకు దారులు మూసుకుపోయాయి

మాల్యాకు దారులు మూసుకుపోయాయి

ముంబై : భారత బ్యాంకుల బకాయిల్ని తీర్చేందుకు మద్యం వ్యాపారి విజయ్ మాల్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సూచనలు లేవు. అతడి పై దివాలా ఉత్తర్వు జారీ చేసినందున చెల్లింపుల పరిష్కారానికి మల్య ముందుకొచ్చినా ప్రయోజనం ఉండదని బ్యాంకులు లండన్ న్యాయస్థానానికి తెలిపాయి. లండన్ ఉన్నత న్యాయస్థానం దివాలా విభాగంలో జరిగిన మాల్య కేసు విచారణలో ఎస్బీఐ నేతృత్వంలోని 13 బ్యాంకులు ఈ మేరకు తెలిపాయి. రాజకీయ కారణాల వల్ల భారత్లో తనకు న్యాయం జరగదన్న మాల్యా వాదనను పట్టించుకోవద్దని కోరాయి. మాల్య చెప్పినట్లు సెక్యూర్డ్ క్రెడిటర్లు కాదన్న బ్యాంకులు రెండో చెల్లింపు పరిష్కారం కింద ఆయన చూపిన యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్ లిమిటెడ్ ఆస్తులు అధికారిక లిక్విడేటర్ అధీనంలో ఉన్నాయని పేర్కొన్నాయి. దరిమిలా మాల్య చెల్లింపు పరిష్కార ప్రతిపాదనలకు విలువ లేదని వివరించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos