శిల్పకళ అద్భుతాలకు తార్కాణం ఉత్సవ రాక్ గార్డెన్..

  • In Tourism
  • September 11, 2019
  • 240 Views
శిల్పకళ అద్భుతాలకు తార్కాణం ఉత్సవ రాక్ గార్డెన్..

భారతదేశ పురాతన చరిత్ర,సంస్కృతి,సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడంలో శిల్పకళ కూడా ఎంతో కీలకపాత్ర పోషించింది.శాస్త్రవేత్తలకు సైతం అంతుచిక్కని విధంగా అబ్బురపరిచే నైపుణ్యంతో శిల్పులు చెక్కిన ఎన్నో శిల్పాలు నేటికి చెక్కుచెదరకుండా భారతీయ చరిత్రను సజీవంగా ఉంచుతున్నాయి.కొన్ని శిల్పాలను చూస్తే తదేకంగా చూస్తూ ఉండిపోవాలనే భావన కలుగగా మరికొన్ని శిల్పాలు మనసుల్లో భావోద్వేగాలను మేల్కొలుపుతాయి.మరెన్నో చిత్రాలు ‘రాతి’గుండెల్లో సైతం తన్మయత్వాన్ని తట్టి లేపుతాయి. ప్రకృతికి ఎన్నో అందాల్ని జోడించి అద్భుతాలను తీర్చి దిద్దుకోవడం గొప్ప కళాత్మకత. కృషి, కళ, నైపుణ్యం మూడు కలిసిపోయి నయన మనోహరంగా కనులవిందు చేసే శిల్ప సౌందర్య విన్యాసాలతో శిలా వనాలెన్నో మన దేశంలో ప్రసిద్ది చెంది ఉన్నాయి.వాటిలో సహజ సిద్ధంగానే రాతి విశేషాలతో అబ్బురపరిచేవి కొన్నైతే…ఉలి తాకిడికి ప్రాణం పోసుకున్నవి మరికొన్ని. అటువంటి అద్భుత శిల్పవనాల్లో ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని హవేరి జిల్లాలో ఉంది. హవేరి పట్టణానికి సుమారు 10 కి. మీ. ల దూరంలో గూతగూడి గ్రామం వెలుపల పల్లెల జీవన విధానం ప్రతిబింబించే ప్రతిమలతో నిర్మించబడిన ఈ ఉత్సవ రాక్ గార్డెన్ గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది.ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా హస్తకళాకారులు, చేతివృత్తుల వారి శిల్పాలు, చిరు వ్యాపారులు, రైతు గ్రామీణ కుటుంబం, పాడి పశువులు వంటి గ్రామీణ సాంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పాలు అబ్బుర పరిస్తాయి. నేటి తరాన్ని ఆలోచింపచేసే విధంగా ఉంటాయి..
ఇలా చేరుకోవాలి..
బెంగళూరు నుండి హుబ్లీకి NH4 మార్గంలో గటాగోడీ విలేజ్ కు 37 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే హవేరీకి 40కి.మీ, బెంగళూరుకు 374కి.మీ, గోవాకు 190కి.మీ, పూణెకు 470కి.మీ ఈ ఉత్సవ్ గార్డెన్ ఉంది. విమాన మార్గం ద్వారా చేసుకోవాలంటే హుబ్లీ (49)కి.మీ దూరంలో విమానశ్రయం ఉంది. అక్కడ నుండి ప్రైవేట్ లేదా ప్రభుత్వ వాహనాల ద్వారా చేరుకోవచ్చు. అలాగే హుబ్లీకి (38 KMS),హవేరీకి (40 KMS)దూరంలో ప్రధాన రైల్వే స్టేషన్ ఉన్నాయి.

శకుంతల


కుస్తీలు పడుతున్నట్లు..


కూరగాయలు కొంటున్నట్లు..


చిన్నారుల ఆటలు..


చిన్నారుల ఆటలు..


ఎడ్లతో పొలాలకు వెళుతున్న రైతులు..


పశువులకు కాపలాగా..


అలనాటి వేట..


చక్కటి కుటుంబం..


అలనాటి కులవృత్తులు..


ఆట విడుపు..


పాట పాడుతూ పిండి విసురుతూ..


నిత్యావసర వస్తువులు కొంటున్న మహిళ..


షావుకారికి లెక్కలు చెబుతూ..


మా జాతకం ఎలా ఉందో..


జీవం ఉట్టిపడుతున్న మయూరాలు..

వేటాడిన చిరుత..


గోశాలలో గోవులు..


దుస్తులు కుడుతూ..


విద్యార్థులకు మధ్యా భోజనం..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos