రవిప్రకాశ్ సార్ ఏంటిదంతా?..

రవిప్రకాశ్ సార్ ఏంటిదంతా?..

మాటల్లో చెప్పే ఆదర్శాలు చేతల్లో కూడా చూపించినపుడే ఎవరికైనా ఒకరిపై నమ్మకం కలుగుతుంది.తన తప్పులు బయట పడనంత వరకు సమాజానికి నీతులు చెప్పిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ తప్పులు బయటపడగానే తానే నీతి తప్పి ప్రవర్తిస్తుండడం ప్రతీ ఒక్కరికీ రవిప్రకాశ్‌పై రోజురోజుకు అసహ్యం కలిగించేలా చేస్తున్నాయి.తోటి మీడియా దోషిలా చిత్రీకరిస్తున్నా జనం అసహ్యించుకుంటున్నా తమకు ఒక దారి చూపించాడనే కృతజ్ఞత భావంతో టీవీ9 సంస్థలోని చాలా మంది ఉద్యోగులు రవిప్రకాశ్‌కు వ్యకతిరేకంగా స్పందించడానికి నిరాకరించారు.రవిప్రకాశ్ ఎపిసోడ్ నేపథ్యంలో కొత్త యాజమాన్యానికి కొందరు సీనియర్ ఉద్యోగులు ఒక విన్నపాన్ని చేసినట్లుగా చెబుతారు. మీ మధ్యన చాలానే ఉండొచ్చు. కానీ.. మేం ఆయనతో కలిసి ఏళ్లకు ఏళ్లుగా పని చేశాం. ఆయనపై నిందలు మోపేలా మా చేత వార్తలు రాయించొద్దు.. చదివించొద్దు. మా నుంచి మీకుండే ఒకే ఒక్క రిక్వెస్ట్ అని చెప్పటం.. అందుకు కొత్త యాజమాన్యం కూడా అంగీకరించడం కూడా జరిగిపోయాయి.అయితే రవిప్రకాశ్‌ తాజాగా కొత్త పాత యాజమాన్యాలపై చేస్తున్న ఆరోపణలతో రవిప్రకాశ్‌పై సానుకూలత వ్యక్తం చేసిన ఉద్యోగుల్లో సైతం కొంత అసహనం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. మొన్నటివరకూ తాము ఆదర్శంగా భావించిన వ్యక్తి ఇంత చిల్లరగా.. దారుణంగా వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న ఆవేదనను టీవీ9 ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. భాగస్వాముల మధ్య ఏదైనా పంచాయితీ ఉంటే దాని సంగతి చూసుకోవాలే కానీ.. సంస్థను దెబ్బ తీసేలా వ్యాఖ్యలు.. దాని ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా విమర్శలు చేయటం ఏమిటంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.టీవీ9ను ప్రారంభించే సమయంలోనే అక్రమ పద్దతిలో.. హవాలాలో నిధులు వచ్చినట్లుగా ఆరోపించటం ఏ మాత్రం సరికాదని.. అలా చెప్పటం ద్వారా.. టీవీ9 సంస్థ  మీద ఉన్న ఇమేజ్ ను దారుణంగా దె్బ్బ తీసినట్లుగా వారు ఫీల్ అవుతున్నారు.రవిసార్ ఏం చేస్తున్నారు?  ఎందుకిలా చేస్తున్నారు?  ఇలా తప్పుల మీద తప్పులు చేయటం ఏమిటి?  ఆయనకు ఏమైంది? అన్న ప్రశ్నలు పలువురు ఉద్యోగుల్లో వస్తున్నాయి.తాజా పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్‌ సార్ మీద మనసు విరిగిపోయినట్లుగా పేర్కొనటం గమనార్హం. టీవీ9 ఉద్యోగుల్లో ఈ తరహా భావన ఇంతకు ముందు లేదని.. తాజా పరిణామాలతో వారిలో మార్పు పెద్ద ఎత్తున వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో ఉన్న సానుకూలత ప్రస్తుతం లేదన్నది తాజా సమాచారం.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos