నష్టాలతో ట్రేడింగ్‌ మొదలు

నష్టాలతో ట్రేడింగ్‌ మొదలు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాలతో ట్రేడింగ్‌ మొదలు పెట్టాయి. ఉదయం 9:19 గంటలకు సెన్సెక్స్‌ 130.34 పాయింట్లు నష్టపోయి 39,626.47 వద్ద, నిఫ్టీ 39 పాయింట్లు కోల్పోయి 11,866.50 వద్ద ట్రేడ్ అయ్యాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.69.36గా దాఖలైంది. 224 కంపెనీల షేర్లు లాభాల్ని గడించాయి. 385 సంస్థల షేర్లు నష్ట పోయాయి. బీపీసీఎల్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బర్గర్‌ పెయింట్స్, కన్సాయ్‌ నెరోలాక్‌ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫినాన్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యస్‌ బ్యాంక్‌, జీ ఎంటర్‌టైన్మెంట్, టీసీఎస్‌, టెక్‌ మహీంద్ర, టాటా మోటార్స్‌, ఓఎన్జీసీ, గ్రాసిమ్‌, హీరో మోటాకార్ప్‌, బ్రిటానియా, హెచ్‌యూఎల్‌ కంపెనీలు నష్టాల పాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos