స్పైడర్ మ్యాన్‌పై పిచ్చి ప్రాణాల మీదికి తెచ్చింది..

స్పైడర్ మ్యాన్‌పై పిచ్చి ప్రాణాల మీదికి తెచ్చింది..

హాలీవుడ్‌ సినిమాల్లో స్పైడర్‌ మ్యాన్‌  సినిమాలకు ఉన్న క్రేజ్‌ చాలా ప్రత్యేకం. గురు దారం సాయంతో గాల్లో విపరీతమైన వేగంతో దూసుకుపోతూ విన్యాసాలు చేసే స్పైడర్‌ మ్యాన్‌కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు.పిల్లల నుంచి పెద్దల వరకు స్పైడర్‌ మ్యాన్‌ను విపరీతంగా అభిమానిస్తుంటారు.అలా స్పైడర్‌ మ్యాన్‌పై విపరీతమైన అభిమానాన్ని ఏర్పరచుకున్న ఓ ముగ్గురు అన్నదమ్ములు తాము కూడా స్పైడర్‌ మ్యాన్‌లా అవ్వడానికి ప్రయత్నించి ఆసుపత్రి పాలయ్యారు. బొలీవియా దేశంలోని చయాంటా పట్టణానికి చెందిన 12 ఏళ్ల లోపు వయసున్న ముగ్గరు సోదరులు ఒక ప్రమాదకర బ్లాక్ విడో సాలీడును పట్టుకుని దాన్ని కర్రతో పొడిచారు. అది ప్రతిస్పందనగా కుట్టడం ప్రారంభించింది. అన్నదమ్ములు ముగ్గురూ వరుసగా దాంతో కుట్టించుకున్నారు. స్పైడర్ మ్యాన్ లక్షణాలు కనిపించలేదు సరికదా, కాసేపటికే కళ్లు తేలేయడం మొదలుపెట్టారు. దాంతో తల్లి ఆందోళనకు గురై వారిని ఆసుపత్రిలో చేర్చింది. అప్పటికే సాలీడు విషం శరీరం మొత్తం పాకడంతో వారి పరిస్థితి విషమించింది. దాంతో వారిని మరో ఆసుపత్రికి తరలించారు.అక్కడ కూడా ప్రయోజనం కనిపించకపోవడంతో లాపాజ్ లోని చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు జ్వరం, వణుకు, ఒళ్లంతా చెమటలు పట్టడం, కండరాల నొప్పితో బాధపడుతున్నారు. లాపాజ్ ఆసుపత్రి వైద్యులు ఎంతో శ్రమించి వారిని ప్రాణాపాయం నుంచి కాపాడారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos