గవర్నర్‌కు ఘాటుగా జవాబిచ్చిన ఉద్ధవ్

గవర్నర్‌కు ఘాటుగా జవాబిచ్చిన ఉద్ధవ్

ముంబై : మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీపై ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మండి పడ్డారు. దేవాలయాలను తెరవాలని కోషియారీ లేఖ రాసినందుకు ఆగ్రహించారు. ‘హఠాత్తుగా అష్ట దిగ్బంధనం విధించడం సరైనది కానట్లుగానే, దానిని ఒకేసారి పూర్తిగా ఉపసంహరించడం కూడా సరైనది కాదు. నేను హిందుత్వను అనుసరిస్తాను. నా హిందుత్వాన్ని మీరు తనిఖీ చేయనక్కర్లేదు’ అని ఉద్ధవ్ పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ప్రార్థనా స్థలాలను తిరిగి తెరిచారు. దేశ వ్యాప్తంగా కూడా దేవాలయాలను తిరిగి తెరిచారు. కరోనా కేసులు విపరీతంగా పెరిగిన దాఖలాలు కనిపించలేదు. మహారాష్ట్రలో దేవాలయాలను తెరవకుండా జాప్యం చేస్తుండటం వెనుక ఉద్దేశం ఏమిటి? (దేవాలయాలను) తిరిగి తెరవడం వాయిదా వేసేందుకు మీకు దివ్య ప్రబోధం ఏమైనా వచ్చిందా? లేదంటే, మీరు ద్వేషించే లౌకికవాదిగా అకస్మాత్తుగా మారిపోయారా? అని ఆశ్చర్యంగా ఉంద’ని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos