విచారణలో కుంటిసాకులు..

విచారణలో కుంటిసాకులు..

 నిజాయితీ ముసుగులో అధికారాన్ని అడ్డం పెట్టుకొని లంచాలతో ప్రజలను పీడిస్తున్న కేశంపేట తహశీల్దార్‌ లావణ్య భారీ మొత్తం నగదుతో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.దీంతో లావణ్యను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టిన అవినీతి నిరోధకశాఖ అధికారులకు విచారణలో లావణ్య చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న లావణ్యను తమ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు గంటల పాటు విచారణ చేసినా ఒక్కంటే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం రాబట్టలేకపోయారని తెలుస్తోంది.విచారణ మొదలుపెట్టగానే తనకు తల తిరుగుతోందని.. వాంతు వచ్చేలా ఉందంటూ కుంటి సాకులు చెబుతూ విచారణ ముందుకు సాగకుండా చేసినట్లు సమాచారం.ఇటీవల ఏసీబీ దాడిలో లావణ్య వద్ద రూ.93లక్షల నగదును అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా నగదు ఎలా సంపాదించారంటూ అధికారులు వేసిన ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పకపోవడం గమనార్హం. రూ.35 లక్షలు సింగిల్సెటిల్మెంట్అనడానికి తమ వద్ద ఉన్న వీడియో సాక్ష్యాలను అధికారులు ఆమె ముం దుంచినట్లు సమాచారం. వాటిని చూడగానే ఆమె మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం అధికారులు ఏమి అడిగినా కూడా ఆమె మౌనంగానే ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 3గంటలకు విచారించినా.. ఆమె దగ్గర నుంచి ఎలాంటి సమాచారం రాబట్టలేకపోయామని ఏసీబీ అధికారులు చెప్పారు

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos