బాబుకు, నాకూ ఉన్న తేడా ఇదే

బాబుకు, నాకూ ఉన్న తేడా ఇదే

కడప:‘ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లు కాలహరణ చేసారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు కడప జిల్లాలో ఉక్కుకర్మాగారానికి టెంకాయ కొట్టి వెళ్లి పోయారు. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకా రం చేసిన ఆరు నెలల కాలంలోనే ఉక్కు కర్మాగారానికి శంకు స్థాపన చేశాన’ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. సోమవారం సున్నపురాళ్ల పల్లె వద్ద ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన తర్వాత జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబులోని మోసపూరిత గుణాన్ని, తనలో ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ‘చంద్రబాబు ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు. వైఎస్ఆర్ ప్రభుత్వం పరిశ్రమకు నీరు, ఖనిజం తదితర మౌలి క సౌకర్యాల కల్పనకూ సంబంధిత విభాగాలు,సంస్థల నుంచి అనుమతుల్ని తెచ్చింది. మూడేళ్ల వ్యవధిలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. 27 వేలకు పైగా ఉద్యోగాలు స్థానికులకు వస్తాయ’ని విపులీకరించారు. రూ.15 వేల కోట్లతో ఉక్కు కర్మాగారానికి సహక రించిన కేంద్ర ప్రభుత్వానికి, ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos