కరోనా కంటే మోదీ రాజకీయాలే ప్రమాదకరం

కరోనా కంటే మోదీ  రాజకీయాలే ప్రమాదకరం

ముంబై: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలను రాబోయే బిహార్ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోసం వాడు కుంటున్నారని శివసేన అధికారిక పత్రిక సామ్నా శుక్రవారం రాసిన సంపాదకీయంలో ఆరోపించింది. జూన్ 15న వాస్తవాధీన రేఖ వద్ద చైనా బలగాలతో జరిగిన ఘర్షణల్లో పాల్గొన్న సైనికులకు ప్రధాని మోదీ కుల, ప్రాంతీయతను అంటగడుతున్నారని దుయ్యబట్టింది. చైనాపై పోరులో బిహార్ రెజి మెంట్ సాహసాన్ని కొనియాడింది. మోదీ వ్యాఖ్యలను తప్ప బట్టింది. సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు ఉన్నప్పుడు అన్నిరకాల బలగాలు విధులు నిర్వహించాయని పేర్కొంది. పుల్వామాలో జరిగిన ఎన్కౌంటర్లో మహారాష్ట్రకు చెందిన ఒక సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేసింది. కేవలం బిహార్ ఎన్నికల కోసమే సైన్యంలో కుల, ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తెచ్చారని మండి పడింది. ఈ రాజకీయాలు కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైనవని ఈసడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos