ఒక్కో ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్.

ఒక్కో ఎమ్మెల్యేలకు రూ. 50 కోట్ల ఆఫర్.

బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’ ప్రారంభించిందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల చొప్పన ఆఫర్లు ఇస్తోందని పేర్కొన్నారు. ‘ఇండియా టీవీ’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జరిగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక ఓటమి పాలైతే ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా ఆయనిలా స్పందించారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏడాది కాలంగా బీజేపీ ప్రయత్నిస్తోందని, ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ. 50 కోట్ల చొప్పున ఆఫర్ చేస్తోందని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైతే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడం అప్పుడు ఈజీ అవుతుందా? అన్న ప్రశ్నకు అది సాధ్యం కాదని కొట్టిపడేశారు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీని వీడరని స్పష్టం చేశారు. తన నేతృత్వంలోని ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుందని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos