పిచ్చి నమ్మకాలతో సచివాలయాన్ని కూల్చేస్తారా?

పిచ్చి నమ్మకాలతో సచివాలయాన్ని కూల్చేస్తారా?

హైదరాబాద్‌ నగరంలోని సచివాలయంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన భవనాలు,మంత్రుల క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకొని వాటిని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలని భావించిన కేసీఆర్‌కు అడగుడగునా ఆటంకాలు,సమస్యలు ఎదరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో ఐదారు దశాబ్దాలైనా పటిష్టంగా ఉండేలా కనిపిస్తున్న సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాల్సిన అవసరం ఏంటంటూ మల్కాజ్‌గిరి నియోజకవర్గ ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రశ్నించడంతో ప్రజల్లో సైతం ఇదే ప్రశ్న ఉదయిస్తోంది.సచివాలయ సముదాయాలను కూల్చేస్తే న్యాయపోరాటం చేస్తామంటూ రేవంత్‌రెడ్డి హెచ్చరించడంతో కొత్త సచివాలయ నిర్మాణం ఇప్పట్లో జరిగేపని కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దీర్ఘకాలిక మన్నిక ఉండే పటిష్టంగా నిర్మించిన సచివాలయాన్ని కూల్చేసి కొత్త సచివాలయం నిర్మించాలంటే భారీమొత్తంలో నిధులు ఖర్చు చేయాల్సి వస్తుందని ఇప్పటికిప్పుడు అంత అవసరం ఏమొచ్చిందో సీఎం కేసీఆర్‌ చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.గతంలో ఇదే సచివాలయం నుంచి పాలన చేసిన ముఖ్యమంత్రులు తమ కొడుకులను ముఖ్యమంత్రులుగా చేయలేకపోయారనే గుడ్డి నమ్మకాన్ని కేసీఆర్‌ అంతేగుడ్డిగా నమ్ముతున్నారని అందుకే కేవలం తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశంతో వాస్తు దోషం కారణంగా చూపి పటిష్టంగా ఉన్న సచివాలయాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.వాస్తుపై నమ్మకం వేరు వాస్తుపై పిచ్చి వేరని కేసీఆర్‌ కూడా వాస్తు పిచ్చితో ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తూ ప్రజలను పట్టించుకోడం విస్మరించారంటూ విమర్శించారు.తన విలాసాల కోసం కొడుకును సీఎం చేయాలనుకునే వ్యక్తిగత ఉద్దేశంతోనే ప్రజాధనంతో కట్టిన సచివాలయాన్ని కూల్చేస్తామంటే సహించేదిలేదని దీనిపై న్యాయపోరాటం చేస్తామంటూ హెచ్చరించిన రేవంత్‌రెడ్డి అందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషికి వినతిపత్రం అందించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎకరాల్లో 42 మంది మంత్రులకు సదుపాయాలు కల్పించేలా కోట్లాది రూపాయలు వెచ్చించి సచివాలయం నిర్మించారన్నారు.సచివాలయంలో చాలా వరకు బ్లాకులు 2004 తర్వాత నిర్మించినవేనని వందేళ్లపాటు మన్నిక ఉండేలా ప్రమాణాలు పాటిస్తూ నిర్మించారన్నారు.విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తమకు దక్కిన భవనాలను సైతం ఖాళీ చేసి తెలంగాణకు అప్పగించిందని దీంతో మొత్తం సచివాలయం తెలంగాణ ప్రభుత్వం చేతుల్లోనే ఉందని ఈ భవనాల్లో సచివాలయంతో పాటు అద్దె భవనాల్లో కార్యకలాపాలు నడుపుతున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా సచివాలయానికి తరలించవచ్చన్నారు.అటువంటిది కేవలం తన కొడుకును సీఎం కాడనే పిచ్చి నమ్మకంతో పటిష్టమైన సచివాలయాన్ని కూల్చేస్తే చూస్తూ ఊరేకునేది లేదంటూ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల తొలంగిపు..కొత్త భవనాల నిర్మాణం అంత తేలికైన విషయం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos