రెండో భార్యకు ఆ హక్కులుండవు…

రెండో భార్యకు ఆ హక్కులుండవు…

రెండవ భార్యకు పెన్షన్ లభించడంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. చట్ట బద్ధంగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకుంటే.. మొదటి భార్యకే ఆ పెన్షన్ లభిస్తుందని, రెండవ భార్యకు ఎలాంటి హక్కులూ ఉండబోవని స్పష్టం చేసింది . మహారాష్ట్ర ప్రభుత్వం తనకు పెన్షన్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ సోలాపూర్‌కు చెందిన శామల్ తాటే దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చిన హైకోర్టు ధర్మాసనం.. ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకెళితే.. మహదేవ్ తాటే సోలాపూర్ కలెక్టరేట్‌లో ప్యూన్‌గా పనిచేసే వాడు. అతను తన మొదటి భార్యను వదిలేసి.. శామల్ తాటేని రెండవ పెళ్లి చేసుకున్నాడు. అయితే, మొదటి భార్యకు విడాకులు ఇవ్వలేదు. ఇలా కాలం గడిచిపోయింది. మహదేవ్ 1996లో మృతి చెందాడు. మొదటి భార్య చట్ట ప్రకారం ముందుకొచ్చింది. మహదేవ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ తనకే దక్కుతాయంటూ మొదటి భార్య వాదించింది.
దాంతో వివాదం పెద్దగా మారడంతో.. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌లో 90 శాతం మొదటి భార్య తీసుకొని, నెలవారీ పింఛన్ రెండోభార్యకు ఇచ్చేలా వారి మధ్య అంతర్గత ఒప్పందం కుదుర్చుకున్నారు. చట్ట ప్రకారం.. ఆ పెన్షన్ మహదేవ్ మొదటి భార్యకే వచ్చేది. అలా వచ్చిన డబ్బును రెండవ భార్య శామల్‌కు ఇచ్చేవారు. అయితే, మహదేవ్ మొదటి భార్య క్యాన్సర్‌తో చనిపోయింది. దాంతో వారికి వచ్చే పెన్షన్ నిలిచిపోయింది. మహదేవ్ రెండో భార్య అయిన తనకు నెలవారీ పెన్షన్ చెల్లించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంది శామల్. ఆ అర్జీని ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. పిటీషన్‌ను పరిశీలించిన ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనంటూ శామల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos