యూపీ సర్కార్‌ తీరును తప్పుబట్టిన సుప్రీం

యూపీ సర్కార్‌ తీరును తప్పుబట్టిన సుప్రీం

న్యూ ఢిల్లీ : లఖింపూర్ ఖేరి ఘటనలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరును దేశ అత్యున్నత న్యాయ స్థానం శుక్రవారం తప్పు బట్టింది. ఘటనకు కారణమైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మిశ్రా కుమారుడి అరెస్టుకు ఎందుకు వారెంట్ జారీ చేయలేదని జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ప్రశ్నించింది. దరిమిలా ఎనిమిది మంది మృతికి కారణమైన లఖింపూర్ కేసును కావాలంటే సీబీఐకి బదిలీ చేయొచ్చని యూపీ సర్కార్ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు సమాధానం ఇచ్చారు. అయితే, సీబీఐ విచారణ సమస్యకు పరిష్కారం కాదని న్యాయమూర్తి ఎన్వీ రమణ పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos