మరో బ్యాంకు ఆధిపత్యానికి రాజన్ ‘పోటీ’

మరో బ్యాంకు ఆధిపత్యానికి  రాజన్ ‘పోటీ’

లండన్: భారత రిజర్వ్‌ బ్యాంక్ మాజీ గవర్నర్‌, ప్రముఖ ఆర్థిక వేత్త రఘురామ్‌ రాజన్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడుతున్న ప్రముఖుల్లో ఒకరు ఉన్నారని బ్లూమ్‌బెర్గ్ వార్తా సంస్థ బుధవారం ఇక్కడ వెల్లడించింది. ప్రస్తుతం షికాగో లోని ఒక విశ్వ విద్యాలయంలో అధ్యాపకుడుగా పాఠాలు బోధిస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌)లోనూ పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. బ్రెగ్జిట్ వల్ల ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ గవర్నర్ మార్క్‌ కార్నే స్థానంలో కొత్త నిపుణుణ్ని వచ్చే అక్టోబర్‌ 31లోగా నియమించనున్నారు. దీని గురించి రఘురాం రాజన్ , బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్ ఇంకా స్పందించ లేదు. బ్రెగ్జి్‌ట్‌ ఓటింగ్ వేళలో అయోమయం పడిన బ్రిటన్‌కు మద్దతుగా రాజన్‌ వ్యాఖ్యలు చేశారు. ఐఎంఎఫ్‌లో ఉన్నపుడు ఆర్థిక మాంద్యం ముప్పును ముందే ఊహించారు. తొలి రోజుల్లో దీనిపై విమర్శలు ఎదుర్కొన్నా ఆయన మాటలు నిజమని తేలడానికి ఎంతో కాలం పట్ట లేదు. 2008లో సంభవించిన ఆర్థిక మాంద్యం వల్ల లీమన్‌ బ్రదర్స్‌ వంటి కంపెనీలే కుప్పకూలాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos