ఇది ప్రతీకార చర్యే

ఇది ప్రతీకార చర్యే

న్యూఢిల్లీ: గాంధీ కుటుంబానికి ఎస్పీజీ (స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్) భద్రతను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం ప్రతీకార చర్యని ఆ పార్టీ సీనియన్ నేత అహ్మద్ పటేల్ మండిపడ్డారు. గాంధీ కుటుంబ సభ్యుల ప్రాణాల రక్షణ గురించి పట్ల కేంద్రం తాత్సారం చేస్తోందని దుయ్యబట్టారు. ఎస్పీజీ కవచం తొలగింపు గాంధీ కుటుంబ సభ్యులపై శతృవులు తేలిగ్గా దాడి చేసే అవకాశాలుంటాయని ఆందోళన చెందారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రత రద్దు చేసి,సిఆర్పిఎఫ్ జడ్ ప్లస్ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos