స్క్రీన్ షాట్లను కోర్టుకు ఎలా సమర్పిస్తారు?

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు సంబంధించి పోలీసులు స్క్రీన్ షాట్స్ ను హైకోర్టుకు సమర్పించడంపై ఆయన తరఫు న్యాయవాది  దిల్‌జిత్ సింగ్ అహ్లువాలియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రవి ప్రకాష్ ఫోన్‌ సంభాషణలకు సంబంధించి స్క్రీన్ షాట్లను కోర్టుకు ఎలా సమర్పిస్తారని ఆయన ప్రశ్నించారు.తన క్లయింట్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటాను స్క్రీన్ షాట్స్ ఎలా తెస్తారని అహ్లూవాలియా ప్రశ్నించారు. కావాలనే లోగో వ్యవహారాన్ని తెరమీదకు తెస్తున్నారని వాదించారు. టీవీ9 లోగో సృష్టికర్త రవి ప్రకాష్ అని, కాపీ రైట్ చట్టం సెక్షన్ 70 ప్రకారం లోగోపై పూర్తి హక్కు అతనికే ఉంటుందని అన్నారు.2003 నుంచి టీవీ9 వ్యవస్థాపకుడిగా రవి ప్రకాష్ వ్యవహరిస్తూ వచ్చారని, సివిల్ తగాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకపోతే చాలా మంచిదని అన్నారు. రవి ప్రకాష్‌కు బెయిల్ ఇస్తే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఏవీ ఎదురు కాబోవని, అందువల్ల ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హారెన్ రావెల్ కు కౌంటర్ గా రవిప్రకాశ్‌ తరపు న్యాయవాది వాదనలు చేశారు.విచారణకు హాజరుకాకుండా రవిప్రకాష్ హైదరాబాద్, బెంగళూరు తిరుగుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టారని రావెల్ వివరించారు. రూ.90 నుంచి రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను రూ.99వేలకే రవిప్రకాష్ విక్రయించాడని, అలా ఎలా అమ్ముతారని ప్రశ్నిస్తే.. కంపెనీకి తానే యజమానిని అని అంటున్నారని రావెల్‌ వాదించారు. కేవలం 9 శాతం వాటా ఉన్న వాళ్లు ఎలా యజమాని అవుతారని న్యాయవాది రావెల్‌ ప్రశ్నించారు. అప్పుడు 90శాతం వాటా ఉన్నవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన రావెల్‌ ఈ కేసును ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos