రాసలీల రమేశ్‌ రాజీనామా

రాసలీల రమేశ్‌ రాజీనామా

బెంగళూరు : యువతిని లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక నీటి పారుదల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి.. బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. సంబంధిత లేఖను ముఖ్యమంత్రి యడియూరప్పకు సమర్పించారు. “నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. నిష్పక్షపాత దర్యాప్తు జరిగేందుకు వీలుగా నేను నా పదవికి రాజీనామా చేస్తున్నా” అని అందులో పేర్కొన్నారు .రమేశ్ రాజీనామాను ఆమోదించాలని కోరుతూ ఆ లేఖను గవర్నర్కు పంపారు యడియూరప్ప. రమేశ్పై ఆరోపణలకు సంబంధించి మంగళవారం ఓ సీడీ మీడియా సంస్థలకు అందింది. ఓ మహిళతో మంత్రి అభ్యంతరకర రీతిలో ఉన్న దృశ్యాలు కన్నడ రాజకీయాల్లో దుమారం రేపాయి. ఈ సీడీ ఆధారంగా.. రమేశ్ జర్కిహోళి ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సామాజిక కార్యకర్త దినేశ్ కల్లహళ్లి ఫిర్యాదు చేశారు. బెంగళూరులోని ఆర్టీ నగర్లో నివసిస్తున్న బాధితురాలిని ఓ లఘు చిత్రం నిర్మిస్తున్న సమయంలో విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మంత్రి లైంగికంగా వేధించారని అందులో పేర్కొన్నారు. ఈ విషయంపై తన వద్ద ఆధారంగా సీడీ ఉందని చెప్పిన బాధితురాలిపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి రమేశ్ జర్కిహోళి మొదట ఖండించారు. తన చిత్రాలను ఉపయోగించి ఎవరో సీడీని రూపొందించారని , ఇది ఫేక్ అని ఆరోపించారు. సమగ్ర దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు వెలుగులోని వస్తాయని, కేసును ఎదుర్కొంటానని, వెనుకంజ వేయబోనని ప్రకటించారు. చివరకు రాజీనామా చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos