పట్టాలు ఎక్కనున్న ప్రైవేటు రైళ్లు

పట్టాలు ఎక్కనున్న ప్రైవేటు రైళ్లు

న్యూఢిల్లీ : ముంబై-ఢిల్లీ, హౌరా-ఢిల్లీ ప్రాంతాల్లో కనీసం నూరు మార్గాల్లో 150 ప్రైవేట్ రైళ్ల నడకకు ఉన్నత స్థాయి సమితి బుధ వారం పచ్చజెండా ఊపింది. తేజాస్ ట్రైన్లను ఇప్పటికే ప్రైవేట్ రంగంలో ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ రంగ రైల్వే లకు గట్టి పోటీ ఏర్పడింది . ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు రైల్వే, పర్యాటక రంగాల్లో అనుభవం, రూ.450 కోట్ల కనీస నికర విలువ ఆస్తు ల్ని కలిగి ఉన్న భారత, అంతర్జాతీయ సంస్థలకు అనుమతిస్తారు. ప్రయాణీకులకు మెరుగైన సేవలు, రైళ్ల రాకపోకల్లో 15 నిమిషాలకు మించని జాప్యం వంటి ఇతర నిబంధనలను ఆయా సంస్థలు పాటించాలి. తొలుత ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-కోల్కతా మా ర్గా ల్లో ప్రైవేట్ రైళ్ల నిర్వహణకు అనుమతించనున్నారు. వేగం గంటకు 160 కిమీ ఉండేలా పట్టాల్ని బాగు చేస్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos